నటి వరలక్ష్మి శరత్‌కుమార్
హైదరాబాద్: కోలీవుడ్ ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కుమార్తెగా వెండితెరకు పరిచయమైనప్పటికీ ఇండస్ట్రీలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు నటి వరలక్ష్మి. ఇటీవల కాలంలో తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం తెలుగులో తన సత్తా చాటుకుంటున్నారు. ప్రతినాయకురాలు లక్షణాలున్న పాత్రలో నటిస్తూ ప్రతిభ నిరూపించుకొంటున్నారు. ఇటీవల ఆమె.. లేడీ విలన్‌గా కనిపించిన ‘క్రాక్’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అంతేకాకుండా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో తన సినీ కెరీర్ గురించి వరలక్ష్మి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
‘నాకు 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు శంకర్ ‘బాయ్స్’ సినిమాలో అవకాశం లభించింది. ఆ సినిమా ఆడిషన్స్‌లో కూడా సెలెక్ట్ అయ్యాను. కాకపోతే నా వయసు చాలాక పోవడంతో.. మా నాన్న ఒప్పుకోలేదు. దాంతో ఆ సినిమా చేజారిపోయింది. అలా ఆ సినిమాలో నటించే అవకాశం జెనీలియాకు దక్కింది. అనంతరం చదువు పూర్తి చేసిన తర్వాత ‘పోడాపోడి’తో నటిగా ఎంట్రీ ఇచ్చాను’
‘పిల్లల్ని ఇండస్ట్రీలోకి పంపించడం మా నాన్నకు ఇష్టం లేదు. మొదట్లో నేను సినీ పరిశ్రమలోకి వస్తానంటే నాన్న ఒప్పుకోలేదు. కానీ, ఇప్పుడు నా నటనను చూసి ఆయన ఎంతో సంతోషిస్తున్నారు. రాధికా ఆంటీ.. చాలా మంచి వ్యక్తి. మేమిద్దరం ఎప్పుడూ సరదాగానే ఉంటాం. అయితే ఆమెకు ఏదైనా రహస్యం చెప్తే.. ఏదో ఒక సందర్భంలో మన ఎదుటే.. అందరికీ ఆ రహస్యాన్ని చెప్పేస్తుంది (నవ్వులు). కొన్ని సందర్భాల్లో నేను ఇలాంటివి ఎదుర్కొన్నాను. వెంటనే నేను.. ఆంటీ.. అది సీక్రెట్.. కాబట్టి ఎవరికీ చెప్పకండి అంటూ సరదాగా అనేదాన్ని’ అని వరలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.
ఇదీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
- ‘బిగ్‌బాస్’ కంటెస్టెంట్ హీరోగా కొత్త సినిమా!
-
రానా ‘అరణ్య’ ట్రైలర్
గుసగుసలు
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
- ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేయనున్న ప్రభాస్..!
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
ఈ కాలం కన్న.. ఒక క్షణ ముందే నే గెలిచి వస్తానని
-
‘సత్యమేవ జయతే’ వచ్చేసింది
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ