close
Published : 08/03/2021 11:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సొంతవాళ్లే నన్ను మోసం చేశారు: రాజేంద్రప్రసాద్‌

హైదరాబాద్‌: డబ్బు విషయంలో అయినవాళ్లే తనని మోసం చేశారని హాస్య నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. మధ్య తరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. సహాయ నటుడిగా, కథానాయకుడిగా.. ఆయన ఎన్నోచిత్రాల్లో నటించి తెలుగువారి మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు‌. ప్రస్తుతం రాజేంద్రప్రసాద్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘క్లైమాక్స్‌‌’. భవానీ శంకర్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా రాజేంద్రప్రసాద్‌ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. శివాజీరాజాతో తనకు ఎలాంటి గొడవలు లేవని ఆయన తెలిపారు.

‘‘నేను దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికంటే ముందు మద్రాస్‌ ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాను. అక్కడ గోల్డ్‌ మెడల్‌ సాధించాను. అయితే, అప్పటికే ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు.. ఇలా ఎంతోమంది అగ్రహీరోలు పరిశ్రమలో ఉన్నారు. కాబట్టి.. ఇండస్ట్రీలో రాణించాలంటే ఎలాంటి సినిమాల్లో నటించాలి అనే సందేహంలో ఉన్నప్పుడు ఓసారి చార్లి చాప్లిన్‌ సినిమాలు చూశా. హాస్యభరితమైన కథలతో ప్రేక్షకుల్ని అలరించాలని అప్పుడే ఫిక్స్‌ అయ్యాను. అలా కామెడీ హీరోగా అందర్నీ ఆకర్షించాను’’

‘‘జీవితంలో బాధాకరమైన సంఘటనలంటూ ఏమీ లేవు. కానీ చాలామంది దగ్గర నేను మోసపోయాను. అదీ ముఖ్యంగా డబ్బు విషయంలో రక్త సంబంధీకుల వద్దే నేను మోసపోయాను. కొన్ని సంఘటనల తర్వాత అసలు నేను ఇన్నాళ్లు సంపాదించిన సొమ్ము ఏమైంది అని చూసుకుంటే.. అప్పుడు అర్థమైంది వాళ్లు నన్ను మోసం చేసి వెళ్లిపోయారని’’ అని రాజేంద్రప్రసాద్‌ వివరించారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని