close
Published : 07/04/2021 20:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘తగ్గేదే లే’ అంటున్న ‘పుష్ప’రాజ్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌తో పాటు మలయాళంలోనూ బన్ని అభిమానులకు శుభవార్త. అల్లు అర్జున్‌ తొలిసారి నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’ టీజర్‌ వచ్చేసింది. సుకుమార్‌ దర్శకత్వంలో బన్ని హీరోగా ఈ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో బన్ని పుష్పరాజ్‌గా ఊరమాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. కాగా.. ఫస్ట్‌లుక్‌తోనే విపరీతమైన ఆసక్తిరేకెత్తించిన చిత్రబృందం తాజాగా టీజర్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌ 8న అల్లు అర్జున్‌ పుట్టినరోజును పురస్కరించుకొని ఒకరోజు ముందుగానే అభిమానుల కోసం టీజర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే కొన్ని సినిమాల్లో బన్ని మాస్‌ పాత్రల్లో అలరించినప్పటికీ ఈ సినిమాలో మాస్‌కు మించి ఊరమాస్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

బన్ని-సుకుమార్‌ కలయికలో ఇప్పటికే ‘ఆర్య’, ‘ఆర్య-2’ చిత్రాలు వచ్చి మంచి విజయాలు సాధించాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ కావడంతో ‘పుష్ప’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బన్ని సరసన రష్మిక ఆడిపాడనుంది. మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా కనిపించనుండటం మరో ప్రత్యేకత. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించారు.  మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని