close
Published : 07/03/2021 13:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రెండో పెళ్లిపై మంచు మనోజ్‌ ట్వీట్‌

వరుస కథనాలపై స్పందించిన హీరో

హైదరాబాద్‌: కథానాయకుడు మంచు మనోజ్‌ త్వరలోనే రెండో వివాహం చేసుకోనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. మనోజ్‌కు కాబోయే సతీమణి మంచు వారి కుటుంబానికి అత్యంత సన్నిహితురాలంటూ వరుస కథనాలు దర్శనమిస్తున్నాయి. కాగా, తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై తాజాగా మనోజ్‌ స్పందించారు. అవన్నీ అవాస్తవాలేనని వ్యంగ్యంగా చెప్పారు. ‘పెళ్లి తేదీ, ముహూర్తం జరిగే సమయం కూడా మీరే చెప్పేయండి’ అంటూ కామెంట్‌ చేశారు. మనోజ్‌ పెట్టిన ట్వీట్‌తో ఆయన పెళ్లి వార్తల్లో నిజంలేదని అందరూ అనుకుంటున్నారు.

‘దొంగా దొంగది’ చిత్రంతో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన మనోజ్‌.. ‘రాజుబాయ్‌’, ‘వేదం’, ‘ఝుమ్మంది నాదం’, ‘పోటుగాడు’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో ప్రణతీ రెడ్డితో ఆయన ఏడడుగులు వేశారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పరస్పర అంగీకారంతో ప్రణతీ నుంచి తాను విడాకులు తీసుకున్నానని 2019లో మనోజ్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన ‘అహం బ్రహ్మాస్మి’లో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా రానున్న ఈ చిత్రానికి శ్రీకాంత్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని