close
Published : 10/04/2021 06:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దొరికిన ఆభరణాల్లో వాటా ఇవ్వాలి

పూర్వ భూ యజమానుల ఆందోళన

పెంబర్తి(జనగామ రూరల్‌), న్యూస్‌టుడే: జనగామ మండలం పెంబర్తిలో లభించిన లంకె బిందెలో బయటపడ్డ ఆభరణాల్లో తమకూ వాటా ఇవ్వాలంటూ భూమి అమ్మకందారులు ఘటనాస్థలంలో శుక్రవారం ఆందోళనకు దిగారు. లంకె బిందె లభించినచోట రెవెన్యూ, పోలీసు, పురావస్తుశాఖ అధికారులు ఇంకేమైనా ఆభరణాలు లభిస్తాయేమోనని తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో గత భూ  యజమానులు (మొదటి పట్టాదారులు) సంకటి ఎల్లయ్య, నర్సయ్య, ఐలమ్మ, పరశురాములు అక్కడకు చేరుకొని కుటుంబ సభ్యులతో నిరసనకు దిగారు. ఈ విషయమై రెవెన్యూ అధికారులు కలగజేసుకొని మీ డిమాండ్‌ను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. తాజా తనిఖీల్లో  6.36 గ్రాముల బంగారు ఆభరణాలైన గుండ్లు, నాగపడిగలు, 2.8 గ్రాముల వెండి గొలుసులు, 7.2 గ్రాముల పగడాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. లంకె బిందెలోని ఆభరణాలు ఓ కుటుంబానికి సంబంధించినవని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని