కొత్త కేసులు 544
close
Published : 28/04/2021 04:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్త కేసులు 544

విజయవాడ వైద్యం, న్యూస్‌టుడే: జిల్లాలో మంగళవారం 544 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం వీటి సంఖ్య 59673కి చేరింది. 7382 మంది బాధితులు వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 51539 మంది వైరస్‌ను జయించి డిశ్ఛార్జి అయ్యారు. ముగ్గురు కరోనా బాధితులు మృతి చెందగా మొత్తం వీరి సంఖ్య 752కి చేరింది.


 

కంట్రోల్‌ రూమ్‌ తనిఖీ

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : నగరంలోని కొవిడ్‌-19 కమాండ్‌, కంట్రోల్‌ రూమ్‌ (104 కాల్‌ సెంటర్‌)ను కలెక్టరు ఇంతియాజ్‌ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫోన్‌ కాల్‌ వచ్చిన వెంటనే సదరు వ్యక్తులతో మర్యాద పూర్వకంగా మాట్లాడి, కరోనా సంబంధ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. పాజిటివ్‌ కేసుల విషయంలో పరిస్థితులను బట్టి ఆసుపత్రుల్లో చేర్చేలా చూడాలన్నారు. 104 కాల్‌ సెంటరు ద్వారా ఆరోగ్య సలహాలు, సత్వర వైద్య సాయం, కొవిడ్‌ పరీక్షలు, పడకల వివరాలు తదితర బహుళ సేవలను అందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని