close
Published : 08/04/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘పుష్ప’ గురించి ఫహద్‌ ఏమన్నారంటే..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ‘పుష్ప’ చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు ఫహద్‌. తన పాత్ర గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారాయన. ‘దర్శకుడు సుకుమార్‌ చెప్పిన స్ర్కిప్టు నాకు చాలా బాగా నచ్చింది. ఈ భారీ యాక్షన్‌ చిత్రంలో భాగస్వామిని అయినందుకు ఆనందంగా ఉంది. ఇందులో నా పాత్ర వైవిధ్యంగా ఉండబోతుంది. నా కెరీర్‌లో ఇప్పటి వరకు ఇలాంటి విభిన్న పాత్ర పోషించలేదు’ అని తెలిపారు. రామ్‌ చరణ్‌ హీరోగా సుకుమార్‌ గతంలో తెరకెక్కించిన చిత్రం ‘రంగస్థలం’ తనని ఎంతగానో మెప్పించిందన్నారు. కమల్‌ హాసన్‌ కథానాయకుడిగా లోకేశ్‌ కనకరాజ్‌ రూపొందిస్తోన్న ‘విక్రమ్‌’ సినిమాలోనూ నటిస్తున్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు.

ఎర్ర చందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పుష్పరాజ్‌గా కనిపించనున్నారు అల్లు అర్జున్‌. బుధవారం సాయంత్రం ఈ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ రానుంది. అర్జున్‌ సరసన రష్మిక నటిస్తోంది. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. సౌండ్‌ డిజైనర్‌గా ఆస్కార్‌ విజేత పూకుట్టిని తీసుకున్నట్టు తాజాగా ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని