హైదరాబాద్: సినీ ప్రముఖులు తరుణ్ భాస్కర్, ఉదయభాను, కార్తికేయ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. పర్యావరణ సంరక్షణ కోసం మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా మూడో విడతలో గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ విసిరిన ఛాలెంజ్‌ను తరుణ్ భాస్కర్ స్వీకరించారు. బంజారాహిల్స్‌లోని తన నివాసంలో తల్లి గీతా భాస్కర్‌తో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎంపీ సంతోష్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ... నటులు విజయ్ దేవరకొండ, రీతూ వర్మ, అభయ్ బెతిగంటిలను నామినేట్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.
ప్రముఖ యాంకర్ ఉదయభాను కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్‌లోని పార్కులో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఒక నెల రోజులు భోజనం లేకుండా ఉండగలం. ఒక వారం రోజులు నీరు లేకుండా ఉండగలం. కానీ ఆక్సిజన్ లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేం. ప్రకృతికి కోపం వస్తే ఏమవుతుందో మనందరం చూస్తున్నాం. భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణం అందించడం మన బాధ్యత. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం.. అందుకే నా కుమార్తెలకు భూమి, ఆరాధ్య అని పేర్లు పెట్టా’ అని అన్నారు. నటి రేణూ దేశాయ్, దర్శకుడు సంపత్ నంది, ప్రముఖ నటుడు బ్రహ్మానందంలను ఆమె నామినేట్ చేశారు.
యువ కథానాయకుడు కార్తికేయ నటుడు విశ్వక్సేన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు. మూడు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, ప్రకృతిని కాపాడాలని కోరారు.
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘రంగ్ దే’.. గుమ్మడికాయ కొట్టేశారు
- ‘పీఎస్పీకే 27’.. ఫస్ట్‌లుక్, టైటిల్ ఆరోజే
- ఆకట్టుకుంటోన్న ‘శ్యామ్‌సింగ్‌రాయ్’ ఫస్ట్‌లుక్!
-
‘ఉప్పెన’ ఎలా తెరకెక్కించారో చూశారా..!
-
నవ్వులు పూయిస్తున్న ‘షాదీ ముబారక్’ ట్రైలర్
గుసగుసలు
- బన్నీ ఊరమాస్ లుక్ @ మూడున్నర గంటలు
- ఎన్టీఆర్‌ను ఢీకొట్టనున్న మక్కళ్ సెల్వన్..!
- శంకర్-చరణ్ మూవీ: ఆ షరతులు పెట్టారా?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
- మార్చి 15న ‘ఆర్.ఆర్.ఆర్’ అప్డేట్?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
నా బ్రెయిన్లో 9 టైటానియం తీగలున్నాయి!
- ‘చెక్’ ఒక ట్రెండ్‌సెట్టర్ అవుతుంది
- నా సినీ భవిష్యత్తును తేల్చే చిత్రమిది!
- డైరెక్టర్ నన్ను నమ్మితే చాలు: నందితాశ్వేత
- ఆ కల ‘శివ’తోనే తీరిపోయింది!
కొత్త పాట గురూ
-
‘నిన్ను చూడకుండ’ పాట చూశారా..?
- ‘ఆర్సీ 15’.. సంగీత దర్శకుడు అతనేనా?
-
‘‘కోలు కోలు’’ అంటూ ఫిదా చేసిన సాయిపల్లవి
-
మోసగాళ్లు నుంచి మరో సింగిల్
-
ఇదీ.. జాతి రత్నాల కథ