ఇంటర్నెట్ డెస్క్: నేడు సుశాంత్‌సింగ్ రాజ్‌పూత్ జయంతి. ఈ వాక్యం వినడానికి అదోలా ఉంది కదా. బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ ఆత్మహత్య చేసుకొని ఏడునెలలు దాటినా.. ఆ చేదునిజాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. 1986లో బిహార్‌లోని పట్నాలో పుట్టిన సుశాంత్ ఒక్కో మెట్టు ఎక్కుతూ సినిమారంగంలో స్టార్డమ్ సంపాదించారు. ధోనీ బయోపిక్‌లో అద్భుతంగా నటించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. ముంబయిలో 2020 జూన్ 14న ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ కేసు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. కాగా.. నేడు ఆయన జయంతి సందర్భంగా బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్‌తో తమకున్న అనుబంధాలను గుర్తుచేసుకున్నారు.
‘ప్రియమైన సుశాంత్.. సినీ మాఫియా నిన్ను నిషేధించింది.. వేధించింది. సోషల్ మీడియాలో చాలాసార్లు సహాయం కోసం ఎదురుచూశావు. ఆ సమయంలో నీకోసం అక్కడ లేకపోయినందుకు చింతిస్తున్నాను. పుట్టినరోజు శుభాకాంక్షలు ప్రియమైన సుశాంత్’ - కంగన
‘సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం మేం ఇలా సంతోషంగా గడిపాం. కానీ.. ఈ రోజు అవన్నీ జ్ఞాపకంగా మిగిలిపోయాయి. పుట్టినరోజు శుభాకాంక్షలు సుశాంత్. మిస్ యూ’ - ప్రీతిజింటా

ఇదీ చదవండి..
మరిన్ని
కొత్త సినిమాలు
-
‘ఆచార్య’ నుంచి మరో న్యూ పిక్
-
విజయేంద్ర ప్రసాద్ కొత్త చిత్రం ‘సీత’
-
ఆసక్తి రేపుతోన్న ‘పవర్ ప్లే’ట్రైలర్!
- ‘వకీల్ సాబ్’ మరో అప్డేట్ ఇచ్చారు
- తెలుగు ‘దృశ్యం 2’ మొదలైంది!
గుసగుసలు
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
- మలయాళీ రీమేక్‌లో శివాత్మిక?
- ‘పుష్ప’ టీజర్.. ఆరోజేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
-
ఇక్కడమ్మాయినే.. కానీ తెలుగు రాదు!
-
వాళ్ల ఊహలకు అందనంత విభిన్నంగా..
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
కొత్త పాట గురూ
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘యుద్ధానికి కావాల్సింది గమ్యం మాత్రమే’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’