కొవాగ్జిన్‌: బ్రిటన్‌ రకంపైనా సమర్థవంతంగా..! - bharat biotech on britain varient
close
Updated : 27/01/2021 18:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొవాగ్జిన్‌: బ్రిటన్‌ రకంపైనా సమర్థవంతంగా..!

భారత్‌ బయోటెక్‌ వెల్లడి

దిల్లీ: ప్రమాదకరమైనదిగా భావిస్తోన్న బ్రిటన్‌ రకం కరోనా స్ట్రెయిన్‌పై ‘కొవాగ్జిన్‌’ టీకా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. బ్రిటన్‌ రకం కరోనా వైరస్‌ను ‘కొవాగ్జిన్‌’ సమర్థవంతంగా తటస్థీకరించడంతో పాటు మ్యుటేషన్‌ చెందుతూ వైరస్‌ తప్పించుకునే ప్రభావాన్ని కూడా తగ్గిస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్‌ తీసుకున్న 26 కేసులకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం, వీటిని ధ్రువపరిచే పరిశోధనా సమాచారాన్ని విడుదల చేసింది.

30శాతం అధిక మరణాలు..
బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ కొత్తరకం వైరస్‌ వుహాన్‌లో బయటపడిన కరోనా‌ కంటే  ప్రమాదకరమని బ్రిటన్‌ నిపుణులు ఇప్పటికే పలుసార్లు స్పష్టంచేశారు. అంతేకాకుండా బ్రిటన్‌లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న కరోనా మరణాల్లో ఈ రకం స్ట్రెయిన్‌ సోకిన వారిలోనే ఎక్కువగా ఉంటున్నట్లు తాజా అధ్యయనాల్లో తేలింది. దాదాపు 30నుంచి 40శాతం కొవిడ్‌ మరణాలు ఈ రకమైన వైరస్‌ కారణంగానే పెరిగినట్లు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. కేవలం గత వారంలోనే బ్రిటన్‌లో కొవిడ్‌ మరణాల సంఖ్య దాదాపు 16శాతం పెరిగినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ఇక ఆసుపత్రుల్లో చేరుతున్న వారిసంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా అక్కడ కరోనా మరణాల సంఖ్య లక్ష దాటింది.

భారత్‌లోనూ..
భారత్‌లో ఇప్పటి వరకు 150 బ్రిటన్‌ స్ట్రెయిన్‌ కేసులు బయటపడ్డాయి. అయితే, ఇప్పటివరకు వీరిలో ప్రమాదకర పరిస్థితి ఏర్పడలేదు. ఇక, భారత్‌లో మూడోదశ ప్రయోగాలు జరుగుతోన్న సమయంలోని అత్యవసర వినియోగం కింద కొవాగ్జిన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అత్యవసర వినియోగం కింద కొవాగ్జిన్‌ టీకాను భారీ స్థాయిలో పంపిణీ చేస్తున్నారు. కొవాగ్జిన్‌ టీకా సమర్థవంతంగానే పనిచేస్తున్నట్లు ది లాన్సెట్‌ కూడా ఈమధ్యే వెల్లడించింది.

ఇవీ చదవండి..
టీకాల్లో వారికి ప్రాధాన్యత అవసరం లేదు: WHO
భారత్‌: 97శాతానికి చేరిన రికవరీ రేటు
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని