☰
శనివారం, జనవరి 16, 2021
home
జాతీయం సినిమా క్రీడలు క్రైమ్ బిజినెస్ పాలిటిక్స్ వెబ్ ప్రత్యేకం
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

  • వసుంధర
  • చదువు
  • సుఖీభవ
  • ఈ-నాడు
  • మ‌క‌రందం
  • రయ్‌.. రయ్‌
  • సిరి
  • ఈ తరం
  • హాయ్‌ బుజ్జీ
  • స్థిరాస్తి
  • కథామృతం
  • దేవ‌తార్చ‌న
  • టెక్ కబుర్లు ‌
  • వైరల్ వీడియోస్
ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

  • వెబ్ ప్రత్యేకం
  • సండే మ్యాగజైన్
  • పాంచ్‌ పటాకా
  • రిజల్ట్స్
E Paper

మ్యాగజైన్స్

  • విపుల
  • చతుర
  • అన్నదాత
  • తెలుగువెలుగు
  • బాలభారతం
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitterInstagram

అవీ.. ఇవీ..

Updated : 23/11/2020 09:44 IST
కాలేజీ టైమ్‌లో నాగ్‌కు చెప్పి.. లాస్‌ ఏంజెల్స్‌కు వెళ్లి..!

వారసత్వం ఉంటే అవకాశాలు తొందరగా వస్తాయి.. కానీ సక్సెస్‌ రాదండోయ్‌.. సత్తా నిరూపించుకుంటే తప్ప ప్రేక్షకులు క్లాప్స్‌ కొట్టరు. అక్కినేని నట వారసుడిగా భారీ అంచనాల మధ్య వచ్చి, కథానాయకుడిగా నిలదొక్కుకున్నారు నాగచైతన్య. తాత ఏఎన్నార్‌, తండ్రి నాగార్జునలా ఈ కుర్రాడిలోనూ జోష్‌ ఉందనుకున్నారు ప్రేక్షకులు. కమర్షియల్‌ సినిమాలతోపాటు వాస్తవికత ప్రధానంగా సాగే కథాంశాలతో వైవిధ్యతను చాటుకున్నారు. ఇమేజ్‌లకు కట్టుబడిపోకుండా.. కొత్తదనాన్ని నమ్ముకుని కథలు ఎంపిక చేసుకుంటున్నారు. సోమవారం చైతన్య పుట్టినరోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం..

కాలేజీలో చదువుతున్నప్పుడే..

చైతన్య చెన్నైలో పుట్టి, పెరిగారు. అక్కడి స్కూల్‌లోనే చదువుకున్నారు. గ్రాడ్యుయేషన్‌ మాత్రం హైదరాబాద్‌లో పూర్తి చేశారు. నటనను వృత్తిగా ఎంచుకుంటానని కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే తండ్రి నాగ్‌తో చెప్పారట. ఆపై ముంబయిలో మూడు నెలలు యాక్టింగ్‌ కోర్సు చేశారు. లాస్‌ ఏంజెల్స్‌లో నటనతోపాటు మార్షల్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. నటుడిగా కెరీర్‌ ఆరంభించడానికి ముందే వాయిస్‌, డైలాగ్స్‌ చెప్పడంలో కోచింగ్‌ తీసుకున్నారు.

తొలి చిత్రంతోనే..

2009లో దర్శకుడు వాసు వర్మ సినిమా ‘జోష్‌’తో చైతన్య హీరోగా అరంగేట్రం చేశారు. ఆరంభంతోనే నటుడిగా మంచి ముద్ర వేసుకున్నారు. కాలేజీ కుర్రాడిగా నటించి, మెప్పించి.. ఉత్తమ నటుడిగా (తొలి పరిచయం) ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు సొంతం చేసుకున్నారు. చైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏమాయ చేసావె’ (2010) ఇద్దరికీ బ్రేక్‌ ఇచ్చింది. ‘100% లవ్‌’, ‘మనం’, ‘ప్రేమమ్‌’, ‘రారండోయ్‌ వేడుకచూద్దాం’, ‘మజిలీ’, ‘వెంకీ మామ’ సినిమాలు హీరోగా చైతన్య స్థాయిని పెంచాయి. ఈ మధ్యలో కొన్ని పరాజయాలు కూడా చూశారు. ‘ఫెయిల్యూర్స్‌ నుంచి చాలా నేర్చుకున్నాను. పరాజయాలు సహజమే అయినా.. తప్పు ఎక్కడ చేశాను, జడ్జిమెంట్‌లో జరిగిన పొరపాట్లు ఏమిటో విశ్లేషించుకుంటా’ అని ఓసారి ఆయన పేర్కొన్నారు. 

రెండు కలలు తీరాయి..

‘వెంకీమామ’ సినిమాతో తన రెండు కలలు ఒకేసారి తీరాయని చైతన్య చెబుతుంటారు. ‘వెంకటేశ్‌ మామయ్యతో కలిసి నటించాలనే ఆలోచన నా మైండ్‌లో ఉండేది. నటుడిగా అనుభవాన్ని సంపాదించుకున్న తర్వాత ఆయనతో సినిమా చేయాలనుకున్నా. అలాగే సురేశ్‌ ప్రొడక్షన్స్‌లో నటించాలనే కల తొలి చిత్రం ‘జోష్‌’ నుంచి ఉంది. ఆ రెండు కోరికలు దీని ద్వారా నెరవేరాయి. గతంలో మా కాంబినేషన్‌లో సినిమా కోసం సురేశ్‌ మామయ్య ఇరవైకిపైగా కథలు పంపించారు. కానీ ఏది వర్కౌట్‌ కాలేదు. చివరికి బాబీ చెప్పిన ఈ కథతో మా సినిమా కుదిరింది’ అని ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

అనుభవం ఉన్నవారితోనే..

కొత్త దర్శకులతో పనిచేయడానికి చైతన్య కాస్త వెనకడుగు వేస్తుంటారు. ఇదే ప్రశ్న ఆయన్ను అడగగా.. ‘నూతన దర్శకులతో నేను చేసిన కొన్ని సినిమాలు ఆడలేదు. అలాగని కొత్త దర్శకులపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. దర్శకుల నటుడిగా ఉండటమే నాకు ఇష్టం. నా కెరీర్‌ సెట్‌ అయ్యే వరకు, అనుభవం ఉన్న వారితో పనిచేయడం వల్ల నటన మెరుగుపడుతుందని అనిపించింది. మరో రెండుమూడు హిట్లు అందుకున్న తర్వాత కొత్త వారితో కలిసి పనిచేస్తా’ అని వివరించారు.

కామెంట్స్‌ చూస్తారు..

సోషల్ మీడియాలో చైతన్య చాలా తక్కువగా స్పందిస్తుంటారనే విషయం తెలిసిందే. దీనర్థం ఆయన ఫాలోవర్స్‌ కామెంట్లు, విమర్శలు పట్టించుకోవడం లేదని కాదండోయ్‌.. ‘సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శల నుంచి నెగటివిటీతో కూడినవి కాకుండా నాకు అవసరమైన వాటిని పరిశీలిస్తాను. నిజాయితీ విమర్శకులు చెప్పే విషయాల నుంచి మంచిని స్వీకరిస్తాను’ అని చైతన్య చెప్పారు.

బైక్‌లంటే పిచ్చి..

చైతన్యకు రైడింగ్స్‌ అంటే చాలా ఇష్టం. ప్రత్యేకించి ఆయనకు బైక్‌లంటే పిచ్చి. ఇవే కాకుండా ఖాళీ సమయాల్లో గిటారు, కీబోర్డు వాయిస్తుంటారు. ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. చైతన్య వ్యాయామానికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు.

రియల్‌ లైఫ్‌లోనూ..

చైతన్య తెరపైనే కాకుండా.. రియల్‌ లైఫ్‌లో మంచి ప్రియుడు, భర్త.. అనిపించుకున్నారు. ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా చిత్ర పరిశ్రమకు వచ్చి, అగ్ర కథానాయికగా ఎదిగిన సమంతను ప్రేమ వివాహం చేసుకున్నారు. ‘ఏమాయ చేసావె’ సెట్‌లో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమ్మతితో 2017 అక్టోబరు 6న గోవాలో వివాహం జరిగింది. హిందూ సంప్రదాయంతోపాటు క్రిస్టియన్‌ పద్ధతుల్లోనూ శుభకార్యాన్ని నిర్వహించారు. పలు ఇంటర్వ్యూల్లో చైతన్య సామ్‌తో తన ప్రేమ కథను పంచుకున్నారు.

మొదటిసారి ఫొటో చూసి..

‘ఏమాయ  చేసావె’ సినిమా ఆడిషన్స్‌లో చైతన్య తొలిసారి సమంత ఫొటో చూశారు. ‘అమ్మాయి బాగానే ఉంది. మన సినిమాకు పనికొస్తుంది’ అనుకున్నారట. కానీ తనే జీవిత భాగస్వామి అవుతుందని చైతన్య ఊహించలేదు. ‘సమంతది సర్దుకుపోయే వ్యక్తిత్వం. మా ఇంట్లో కూడా ఫార్మాలిటీస్‌ ఉండవు. కాబట్టి నాకు భయాల్లేవు. సమంతని నేరుగా తీసుకెళ్లి.. ‘మీ కోడలు’ అనేయలేదు. లంచ్‌కీ, ఇంట్లో జరిగే పార్టీలకీ తీసుకెళ్లి.. మా ఇంటినీ, మనుషుల్ని అలవాటు చేశా. సమంత మధ్యతరగతి నుంచి వచ్చిన అమ్మాయి. తన మైండ్‌సెట్‌ బాగుంటుంది. చాలా కష్టపడి పైకొచ్చింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఇమిడిపోతుంది. సామ్‌ను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పడానికి భయమేసింది. కానీ చెప్పగానే అర్థం చేసుకున్నారు. విషయం చెప్పగానే నాన్న.. ‘సమంతనే ఎందుకు చేసుకుంటావ్‌? చేసుకుంటే మీ ఇద్దరూ సంతోషంగా ఉండగలరా? నాకు ఈ విషయం ఎప్పుడో తెలుసు..’ అన్నారు. అలా నన్ను ప్రశ్నించడం కూడా ముఖ్యమే. తల్లిదండ్రులుగా వారికీ కొన్ని బాధ్యతలు, భయాలు ఉంటాయి’ అని పెళ్లికి ముందు పరిస్థితిని ఓసారి చైతన్య వివరించారు.

ముక్కలైందట.. 

‘హృదయం ముక్కలైంది అంటుంటారు కదా. అలాంటి అనుభవాలు నా జీవితంలో కూడా ఉన్నాయి. అవి చాలా బాధని మిగిల్చాయి. అయితే ఆ బంధాలు మిగిల్చిన అనుభవాల వల్లే వ్యక్తిగా మరింత పరిణతి సాధించాను’ అంటుంటారు చైతన్య. గత కొన్నేళ్లుగా సమంత తన కష్టసుఖాల్లో తోడుగా ఉందని, ప్రోత్సహిస్తుంటుందని ఆయన పేర్కొన్నారు. ‘సామ్‌ నా అదృష్టం మాత్రమే కాదు.. నా బెస్ట్‌ సపోర్టర్‌ కూడా. సక్సెస్‌లో అందరూ మన పక్కనుంటారు. ఫెయిల్యూర్‌లో దూరమవుతారు. రెండు సందర్భాల్లోనూ సామ్‌ నాకు ధైర్యాన్ని ఇచ్చింది’ అని పేర్కొన్నారు.

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags: Naga Chaitanyasamanthatollywoodactorstoryspecial storyనాగచైతన్యసమంతటాలీవుడ్‌నటుడుపుట్టినరోజుబర్త్‌డేకథనంప్రత్యేక కథనం
టాలీవుడ్‌గుస‌గుస‌లుకొత్త సినిమాలుఇంటర్వ్యూబాలీవుడ్సినిమా రివ్యూఓటీటీ సంగతులుఅప్పటి ముచ్చట్లుతాజా వార్తలు

మరిన్ని

  • క్షమాపణలు చెప్పిన విజయ్‌సేతుపతి తమిళ నటుడు విజయ్‌ సేతుపతి క్షమాపణలు చెప్పాడు. తన పుట్టినరోజు సందర్భంగా వినూత్నంగా ప్రయత్నించి కేక్‌ కట్‌ చేయడమే ఇందుకు కారణం. కేక్‌ కోస్తే క్షమాపణలు చెప్పడం దేనికి అనుకుంటున్నారా..? ఆయన ఆ కేకును ఖడ్గంతో కోశారు మరి. ఆ ఫొటో కాస్తా వైరలైంది. ఇంకేముంది నెటిజన్లు విమర్శలు చేయడం ప్రారంభించారు.
  • మహేశ్‌బాబు అందానికి రహస్యమదే: విష్ణు టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబును ఇష్టపడనివారు ఎవరైనా ఉంటారా..? కేవలం అభిమానులే కాదు.. తన సహనటులతో పాటు దక్షిణాది.. ఉత్తరాది సినీ ప్రముఖులు కూడా మహేశ్‌బాబు అందానికి ఫిదా అయినవాళ్లే. మంచితనాన్ని కొనియాడినవాళ్లే. తాజాగా మహేశ్‌బాబుపై హీరో మంచు
  • సాబ్‌ రీఎంట్రీ.. రెస్పాన్స్‌ మామూలుగా లేదుగా పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌.. వెండితెరపై ఈ పేరును చూడాలని దాదాపు మూడేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశకు జీవం పోస్తూ విడుదలైన ‘వకీల్‌సాబ్‌’ టీజర్‌కు భారీ స్పందన లభిస్తోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో...
  • కేజీయఫ్‌-2 రోరింగ్‌.. ఆర్జీవీ పంచ్‌ బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న ‘కేజీయఫ్‌’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘కేజీయఫ్‌-2’ టీమ్‌పై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల విడుదలైన ‘కేజీయఫ్‌-2’ టీజర్‌కు వస్తోన్న రెస్పాన్స్‌ పట్ల ఆర్జీవీ స్పందించారు....
  • మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్‌ నైట్‌ అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి నివాసంలో సంక్రాంతి పండుగ వేడుకలు గత రెండు రోజులుగా సందడిగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఇంటి ఆవరణలో భోగి మంటలతో ఈ వేడుకలను ప్రారంభించిన మెగా ఫ్యామిలీ..
  • తమన్నా చీట్‌: సాయేషా డ్యాన్స్‌: మంచు కుటుంబం స్టార్‌ హీరోయిన్‌ తమన్నా చీటింగ్‌ మొదలైందట. వేరేలా అనుకోవద్దు. డైట్‌కు స్వస్తి చెప్పి ఎంచక్కా ఇష్టమైనవన్నీ
  • అవసరాల కోసం ఆ డబ్బు వాడేసిన రవితేజ మాస్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రాలతో ప్రేక్షకులను అలరించి మాస్‌ మహారాజ్‌గా గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు రవితేజ. ఆయన హీరోగా నటించిన ‘క్రాక్‌’ సంక్రాంతిని పురస్కరించుకుని ఈ నెల...
  • లడ్డూ కావాలా..? పంచ్‌ ఇచ్చిన దిశాపటాని కొత్త సంవత్సరం.. కొత్త సంబరాలు.. కొత్త ఆనందాలు.. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ.. మంచు మనోజ్‌ ట్వీట్‌ చేశారు. వేడుకలకు సంబంధించిన వీడియోను ఆయన పంచుకున్నారు. హీరోయిన్‌ దిశాపటాని బాక్సింగ్‌ చేస్తోంది. పంచ్‌ బ్యాగ్‌ను గాల్లోకి ఎగిరి మరీ తన్నుతున్న వీడియోను ఆమె పోస్టు చేసింది.
  • సంక్రాంతి ప్రత్యేకం: చీరకట్టి.. మనసు కొల్లగొట్టి పండగ అనగానే అందరికీ మొదట గుర్తొచ్చేది వస్త్రాలంకరణ. ఆడవాళ్ల గురించి చెప్పాలంటే.. వచ్చే ఈ పండగకు ఎలాంటి చీరకట్టుకొవాలి.. ఎలా ముస్తాబు కావాలి.. ఏ చీరమీదకు ఎలాంటి ఆభరణాలు ధరించాలి అని చర్చలు పెడుతుంటారు. సినీ నటులు.. హీరోయిన్లు ఇందుకు మినహాయింపేం కాదు.
  • RRRపై సెటైర్‌.. స్పందించిన చిత్రబృందం దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే తెలిసిందే కదా.. ఆయన సినిమా తీస్తే ప్రేక్షకులను వందశాతం అలరించాల్సిందే.. అందుకే సమయం కాస్త ఎక్కువగానే తీసుకుంటారు. మిగతా డైరెక్టర్లు సంవత్సరానికో సినిమా చొప్పున విడుదల చేస్తుంటే ఆయన మాత్రం నిదానంగా రెండుమూడేళ్లు తీసుకొని
  • సంక్రాంతి వేళ.. సెలబ్రిటీలు ఏమన్నారంటే..! ‘భోగ భాగ్యాల ఈ సంక్రాంతి అందరి ఇంట కలల పంట పండించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ట్విటర్‌ వేదికగా....
  • రవితేజ అదరగొట్టేశారు..! మాస్‌ మహారాజ్‌ రవితేజపై మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ‘క్రాక్‌’లో రవితేజ నటన టాప్‌ లెవల్‌లో ఉందని ఆయన అన్నారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న రామ్‌చరణ్‌ తాజాగా ‘క్రాక్‌’ చిత్రాన్ని వీక్షించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ...
  • ‘డర్టీ’ భామ.. బాపుబొమ్మ..! ‘డర్టీహరి’ హీరోయిన్‌ సిమ్రత్‌కౌర్‌ భోగి శుభాకాంక్షలు చెబుతూ ఒక వీడియో పోస్టు చేసింది. ఆమె గతంలో పోస్టు చేసిన ఒక ఫొటోకు బాపుగారి బొమ్మ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. యువనటుడు సుధీర్‌బాబు కండలు పెంచేందుకు కఠినంగా శ్రమిస్తున్నాడు. తన తర్వాతి సినిమా ‘శ్రీదేవీసోడాసెంటర్‌’ కోసం కసరత్తు చేస్తున్నాడు. జిమ్‌లో వర్కౌట్‌కు చేస్తున్న దృశ్యాలను వీడియో రూపంలో ఇన్‌స్టాలో పంచుకున్నాడు.
  • ఇంతలా ఆదరిస్తారని ఊహించలేదు: రవితేజ మాస్‌ మహారాజ్‌ రవితేజ, డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌ హాట్రిక్‌ హిట్టు కొట్టింది. ‘డాన్‌శీను’, ‘బలుపు’ తర్వాత ఇప్పుడు మరోసారి వాళ్లిద్దరూ కలిసి పనిచేసిన ‘క్రాక్‌’ జనవరి 9న విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రవితేజ సరసన శృతిహాసన్‌ నటించింది.
  • మాది పాలు-నీళ్ల బంధం: శివబాలాజీ   ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి అందురూ అభిమానులే. సెలబ్రిటీలను షోకు అతిథులుగా పిలిచి తనదైన శైలిలో ఆలీ ఇంటర్వ్యూ చేస్తారు. తాజాగా ఆ షోకు నటులు శివబాలాజీ, మధుమిత జంటగా హాజరయ్యారు.
  • సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌కు లారెన్స్‌ క్షమాపణలు ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌, దర్శకుడు రాఘవ లారెన్స్‌ తాజాగా అగ్ర కథానాయకుడు, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ అభిమానులకు క్షమాపణలు తెలిపారు. రజనీకాంత్‌ ఆరోగ్యంగా జీవించాలని ఆయన కోరుకున్నారు. అసలేం జరిగిందంటే..
  • ‘మాస్టర్‌’ డైరెక్టర్‌ భావోద్వేగం! విజయ్‌ ‘మాస్టర్‌’ సినిమా సందడి థియేటర్లలో మొదలైంది. అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్‌ టాక్‌ రావడంతో చిత్రబృందం ఆనందంలో మునిగితేలుతున్నారు. తాజాగా ఆ సినిమా డైరెక్టర్‌ లోకేష్ కనగరాజ్‌ బుధవారం ఉదయం చెన్నైలోని ఓ థియేటర్లో ప్రేక్షకుల మధ్య
  • సామ్‌, కీర్తిసురేష్‌ల ఇన్‌స్టా పోస్ట్‌ ఏంటంటే? ఇళయ దళపతి విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’చిత్రాన్ని ధియేటర్లో చూసేందుకు చాలా అతృతగా ఉందంటూ నటి సమంత అంటున్నారు. అలాగే మరో నటి కీర్తిసురేష్‌ ధియేటర్లో ‘మాస్టర్‌’చిత్రాన్ని చూస్తున్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు.
  • ఆయనకెంతో రుణపడి ఉన్నా..: త్రివిక్రమ్‌ రచయితగా మాటలతో మాయచేస్తారు.. దర్శకుడిగా సినిమాలతో మైమరపిస్తారు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌. కేవలం హీరోలను చూసే థియేటర్లకు వెళ్లే రోజుల్లో డైరెక్టర్లను చూసి కూడా సినిమాలకు వెళ్లొచ్చన్న ఆలోచన పుట్టించారు. ‘స్వయంవరంతో’ మొదలై ‘అలవైకుంఠపురములో’ వరకూ సాగిన..
  • తప్పులు సహజం: రామ్ ఇస్మార్ట్‌ హీరో రామ్‌ పోతినేని కథానాయకుడిగా తెరకెక్కిన కమర్షియల్‌, లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘రెడ్‌’. తమిళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘తడమ్‌’ రీమేక్‌గా ఈసినిమా రానుంది. కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి....
  • రామ్‌తో న్యూలైఫ్‌.. ఫుల్‌ హ్యాపీ: సునీత ఎన్నో మధురమైన పాటలు పాడి తన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుని.. టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు గాయని సునీత. తాజాగా ఆమె రామ్‌ వీరపనేని అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే...
  • సోషల్‌ లుక్‌: శుభవార్త చెప్పిన రామచిలుక శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ బెల్లీ డ్యాన్స్‌ చేసింది. బురిటో బెల్లీ డ్యాన్స్‌ సెషన్లు మిస్‌ అవుతున్నా అంటూ తాను డ్యాన్స్‌ చేస్తున్న వీడియో పోస్టు చేసింది. మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ కరోనా నుంచి కోలుకున్నారు. ‘బ్యాక్‌ ఇన్‌ యాక్షన్‌’ అంటూ చరణ్‌ తన భుజంపై వాలిన రామచిలకతో మాట్లాడుతున్నట్లుగా..
  • సరికొత్తగా ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’షో..! ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్‌, ఢీ డ్యాన్స్‌ షో వంటి కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది మల్లెమాల సంస్థ. తాజగా‘శ్రీదేవి డ్రామా కంపెనీ’పేరుతో మరో కొత్త ఎంటర్‌టైన్‌మెంట్ ‌షోను అందించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల
  • ‘మాస్టర్‌’ లీక్‌.. స్పందించిన డైరెక్టర్‌ కరోనా లాక్‌డౌన్‌లో మూతపడ్డ థియేటర్లు మళ్లీ తెరచుకున్నాయో లేదో పైరసీ భూతం నిద్రలేచింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలకు సిద్ధమైన ‘మాస్టర్‌’ లీక్‌ అయింది. విజయ్‌ హీరోగా లోకేశ్‌ కనగరాజన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రేపు(జనవరి 13న) థియేటర్లలో విడుదల కానుంది.
  • బన్నీ ‘ర్యాప్‌ సాంగ్‌’ రప్ఫాడిస్తోందిగా! స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు యూత్‌లో ఉండే క్రేజే వేరు! ఒక్క టాలీవుడ్‌లోనే కాదు మాలీవుడ్‌లోనూ మల్లుస్టార్‌గా ఆయనకు ఓ రేంజ్‌లో ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. తాజాగా ఆయన సినీ ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ వచ్చిన ర్యాప్‌ సాంగ్‌ యూట్యూబ్‌లో హల్‌చల్‌   
  • సోషల్‌ లుక్‌: చీర కట్టి.. పల్టీలు కొట్టిన హీరోయిన్‌ హీరోయిన్‌ అదాశర్మ చీరకట్టులో పల్టీలు కొట్టింది. సముద్రతీరంలో ఆమె చేసిన విన్యాసాలను చూపిస్తూ ఓ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. నేడు డైరెక్టర్‌ సుకుమార్ జన్మదినం. ఈ సందర్భంగా సుక్కూతో కలిసి ఉన్న ఫొటోను స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ పంచుకున్నాడు.
  • ‘అలవైకుంఠపురములో’ ఏడాది సంబరాలు అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో ‘అలవైకుంఠపురములో’ ఎంతపెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆ సినిమా వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా.. చిత్రబృందం.. ఏడాది సంబురాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నటీనటులతో పాటు దర్శకనిర్మాతలు,
  • సుమ ఊళ్లో సంక్రాంతి.. చూశారా?   సుమ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘క్యాష్‌’ ప్రోగ్రాం సందడే వేరు. ఈ వారం కార్యక్రమానికి అతిథులుగా నటీమణులు సంగీత, స్వాతి దీక్షిత్‌,కామ్నజెఠ్మలాని, ఇషా చావ్లా హాజరయ్యారు. తాజాగా ఆ ఎపిసోడ్‌ ప్రోమోను రిలీజ్‌ చేశారు.  సంక్రాంతి స్పెషల్‌గా
  • చిరు.. పవన్‌.. వెంకీ.. అందరిదీ అదే దారి! ‘రీమేక్‌’ సినిమా అంటే జిరాక్స్‌ కాపీ కాదు. ఇతర భాషల్లో హిట్‌ సినిమాను అచ్చుగుద్దినట్లు తెరకెక్కిస్తే సినిమా విజయం సాధిస్తుందో లేదో తెలియదు కానీ.. డైరెక్టర్‌ ప్రతిభకు చెడ్డపేరు రావడం పక్కా. అందుకే రీమేక్‌ల విషయంలో డైరెక్టర్లు చాలా జాగ్రత్తలు వహిస్తుంటారు. రీమేక్‌ అయినప్పటికీ తమదైన వైవిధ్యం చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు.
  • వివాహబంధంలోకి వైవా హర్ష.. సినీనటుడు వైవా హర్ష త్వరలో ఒక ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా ఇన్‌స్టాగ్రాంలో తనకు కాబోయే భార్యతో దిగిన ఫొటోను షేర్‌ చేసి ‘హలో వరల్డ్‌..మీట్‌ మై వరల్డ్‌’అంటూ రాసుకొచ్చారు. అలాగే మరో ఫొటోను షేర్‌ చేసి ఇదే బ్యాచిలర్‌గా తన ఆఖరి సెల్ఫీ

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

  • ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
  • ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
  • క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
  • రోహిత్‌ను సరదాగా ట్రోల్‌ చేసిన డీకే
  • చరిత్ర సృష్టించిన నయా యార్కర్‌ కింగ్‌
  • సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ 
  • కన్నీటి పర్యంతమైన మోదీ
  • కంగారూను పట్టలేక..
  • రెరా మధ్యే మార్గం
  • ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్‌ బైకర్‌ మృతి
మరిన్ని
© 1999- 2021 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

This website follows the DNPA Code of Ethics.