‘ఎఫ్‌ 11’తో ముగింపేనా! - vin diesel says fast and furious saga will end after 11 movies
close
Published : 14/06/2021 09:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఎఫ్‌ 11’తో ముగింపేనా!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ ఫ్రాంఛైజీ చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులున్నారు. ఈ చిత్రాల్లో నటించిన నటులందరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విన్‌డీసిల్‌కు స్టార్‌డమ్‌ తెచ్చిపెట్టడంలో ఈ చిత్రాలే కీలకంగా నిలిచాయి. త్వరలోనే ‘ఎఫ్‌ 9’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కొవిడ్‌ పరిస్థితులు కారణంగా చాలా నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది ఈ చిత్రం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ సినిమాపై అంచనాల్ని అమాంతం పెంచేసింది. ఇప్పుడు ఈ ఫ్రాంఛైజీలో ‘ఎఫ్‌10’, ‘ఎఫ్‌ 11’ చిత్రాలను కూడా తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మాత్రం ఈ ఫ్రాంఛైజీలో చిత్రాలు రావు అంటున్నారు విన్‌ డీసిల్‌. ‘‘ప్రతి కథకు ముగింపు ఉండాల్సిందే. చాలామందికి ఇది ఇష్టం ఉండకపోవచ్చు. కానీ ఫ్రాంఛైజీ చిత్రాలకు వీడ్కోలు పలకడం సరైందే. ఇవి ఎన్నో రికార్డుల్ని అధిగమించాయి. అదే సమయంలో ఈ ఫ్రాంఛైజీకంటూ ఒక ఆత్మ ఉంటుంది. దానికి విశ్రాంతి కావాలి’’అని చెప్పారు డీసిల్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని