Vijay: ‘మక్కల్‌ ఇయక్కం’ పార్టీని రద్దు చేసిన విజయ్‌ తండ్రి - vijay makkal iyakkam dissolved says his father
close
Updated : 28/09/2021 13:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vijay: ‘మక్కల్‌ ఇయక్కం’ పార్టీని రద్దు చేసిన విజయ్‌ తండ్రి

చెన్నై: ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ పార్టీని రద్దు చేసినట్టు దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ చెన్నై హక్కుల కోర్టులో సమాధాన పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రముఖ నటుడు విజయ్‌ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్‌ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్‌ఏ చంద్రశేఖర్‌ 2020లో ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేశారు. తన పేరు ఉపయోగించుకుని కార్యక్రమాలు నిర్వహించడంపై నిషేధం విధించాలని విజయ్‌ ఇటీవల చెన్నై హక్కుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తాజాగా దీనిపై విచారణ జరిగింది. ‘విజయ్‌ మక్కల్‌ ఇయక్కం’ను రద్దు చేసినట్టు చంద్రశేఖర్‌ సమాధాన పిటిషన్‌ దాఖలు చేశారు.

అనుమతి లేకుండా తన పేరు వాడుతున్నారంటూ విజయ్‌ తన తల్లిదండ్రులతో పాటు మరో 11 మందిపై కేసు పెట్టిన ఘటన సంచలనం సృష్టించింది. తండ్రి పెట్టిన పార్టీతో తనకు సంబంధం లేదని విజయ్‌ గతంలో ప్రకటించారు. కానీ, విజయ్‌పేరుతో పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని, తన పేరు వాడుకుంటున్నారని ఆరోపిస్తూ విజయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఈ ఘటన తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని