Shilpa Shetty: రాజ్‌కుంద్రా ఏం చేసేవాడో నాకు తెలియదు..! - too busy didnt know what raj kundra was up to shilpa shetty to cops
close
Published : 16/09/2021 21:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Shilpa Shetty: రాజ్‌కుంద్రా ఏం చేసేవాడో నాకు తెలియదు..!

ముంబయి: అశ్లీల చిత్రాల నిర్మాణం, ప్రసారం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాపై ముంబయి పోలీసులు తాజాగా ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ కేసులో సాక్షుల జాబితాలో శిల్పాశెట్టి పేరునూ చేర్చారు. ఈ క్రమంలో ఆమెను విచారించగా.. తన భర్త కార్యకలాపాల గురించి తనకు తెలియదని పోలీసులకు తేల్చి చెప్పారు.

‘నా పనుల్లో నేను చాలా బిజీగా ఉండేదాన్ని. రాజ్‌కుంద్రా ఏం చేసేవాడో నాకు తెలియదు’ అని వెల్లడించారు. పోలీసులు దాఖలు చేసిన 1,400 పేజీల ఛార్జ్‌షీట్‌లో ఈ విషయాన్ని పొందుపర్చారు. అలాగే అశ్లీల చిత్రాలకు సంబంధించిన యాప్‌ల గురించి కూడా తనకు తెలియదని ఆమె తెలిపారు. ఈకేసులో భాగంగా రాజ్ కుంద్రాతో సహా కొంత మంది ఉద్యోగులను జులై 19న పోలీసులు అరెస్టు చేయగా.. వారిలో నలుగురు ఉద్యోగులు అతనికి వ్యతిరేక సాక్షులుగా మారినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాజ్‌కుంద్రాను కోర్టులో విచారిస్తున్న సందర్భంగా తాను తీసిన కంటెంట్‌ అసభ్యకరం కావచ్చు కానీ అశ్లీలమైనది కాదని ఆయన తెలిపారు.  ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఇలాంటి వీడియోలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని