Krishna Vamsi: కృష్ణవంశీ పుట్టినరోజు.. కలిసిన పోటీదారులు - telugu news prakash raj and hema in krishna vamsi birthday celebrations
close
Published : 28/07/2021 17:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Krishna Vamsi: కృష్ణవంశీ పుట్టినరోజు.. కలిసిన పోటీదారులు

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ఇంట సినీ తారలు సందడి చేశారు. మంగళవారం ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేడుకల్లో టీటౌన్‌ తారలు తళుక్కున మెరిశారు.  ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, ఉత్తేజ్‌, తనీష్‌, సమీర్‌, రాజా రవీంద్ర తదితరులు సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో భాగంగా అధ్యక్ష పదవి కోసం ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్, హేమ.. వేడుకల్లో పాల్గొని సరదాగా మాట్లాడుకున్నారు. కృష్ణవంశీతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. దీంతో, ప్రస్తుతం ఈ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి.

‘నక్షత్రం’ పరాజయం తర్వాత సుమారు రెండేళ్ల విరామానంతరం కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్‌’ను ఆధారంగా చేసుకుని ఈసినిమా తెరకెక్కిస్తున్నారు. థియేటర్‌ ఆర్టిస్ట్‌లు పడుతున్న ఇబ్బందులను తెలియజేసే విధంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. రమ్యకృష్ణ, ప్రకాశ్‌ రాజ్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. బ్రహ్మానందం, రాహుల్‌ సిప్లిగంజ్‌, శివాత్మిక..తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇళయరాజా స్వరాలు అందిస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని