Nayanthara: తిరుమలలో నయన్‌, విఘ్నేశ్‌.. ఫొటోలు వైరల్‌ - telugu news nayanthara vignesh dil raju vamshi paidipally visited tirumala
close
Published : 27/09/2021 23:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Nayanthara: తిరుమలలో నయన్‌, విఘ్నేశ్‌.. ఫొటోలు వైరల్‌

తిరుమల: కోలీవుడ్‌ ప్రముఖులు, కాబోయే దంపతులు నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తమ మొక్కుల్ని చెల్లించుకున్నారు. అనంతరం అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న కొందరు అభిమానులు వీరితో సెల్ఫీ తీసుకున్నారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. నయనతార నీలిరంగు డ్రెస్సులో, విఘ్నేశ తెల్ల చొక్కా, పంచెతో కనిపించారు. నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న సంగతి తెలిసిందే.

దిల్‌ రాజు, వంశీ పైడిపల్లి..

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి శ్రీవారిని దర్శించుకున్నారు. వంశీ పైడిపల్లి కుటుంబంతో కలిసి వచ్చారు. తమిళ నటుడు విజయ్‌ హీరోగా వంశీ పైడిపల్లి ఓ చిత్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు. 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని