Narappa: ప్రపంచ వేదికపైకి ‘నారప్ప’ సంగీతం - telugu news narappa music
close
Published : 28/07/2021 11:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Narappa: ప్రపంచ వేదికపైకి ‘నారప్ప’ సంగీతం

హైదరాబాద్‌: ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ ఇటీవలే ఎస్‌.పి.మ్యూజిక్‌ని ఏర్పాటు చేసి సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ‘నారప్ప’ పాటలు ఈ సంస్థ నుంచే వచ్చాయి. తాజాగా ఎస్‌.పి.మ్యూజిక్‌తో పారిస్‌కి చెందిన ప్రఖ్యాత డిజిటల్‌ మ్యూజిక్‌ కంపెనీ ‘బిలీవ్‌’ జట్టు కట్టింది. ఈ భాగస్వామ్యంలో తొలి ప్రయత్నంగా ‘నారప్ప’ సంగీతాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లనున్నట్టు నిర్మాత డి.సురేష్‌ బాబు వెల్లడించారు. ‘‘బిలీవ్‌కి ప్రపంచస్థాయి నెట్‌వర్క్‌ ఉంది. ఆ సంస్థతో భాగస్వామి కావడం ఎస్‌.పి.మ్యూజిక్‌కి దక్కిన గొప్ప అవకాశం. ‘నారప్ప’ సంగీతానికి ప్రపంచ స్థాయిలో ప్రాచుర్యం కల్పించనున్నాం. మా భాగస్వామ్యంతో తెలుగు సినిమా సంగీతానికి కొత్త శకం మొదలవుతుంద’’ని సురేష్‌బాబు తెలిపారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని