BiggBoss Telugu5: శిక్ష వేసుకున్న కెప్టెన్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అనుకోని అతిథి.. - telugu news biggboss telugu season 5 latest episode
close
Updated : 25/09/2021 09:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

BiggBoss Telugu5: శిక్ష వేసుకున్న కెప్టెన్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అనుకోని అతిథి..

హైదరాబాద్‌: కింగ్‌ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది. ఇంటి సభ్యుల మధ్య జరిగే సిల్లీ వాదోపవాదాలు.. లవ్‌ట్రాక్స్.. ఫ్రెండ్‌షిప్‌ గోల్స్‌.. ఇలా ప్రతిఒక్కటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. కాగా, తాజాగా ప్రసారమైన 19వ రోజు ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల ప్రవర్తనతో విసిగిపోయిన కెప్టెన్‌ జెస్సీ.. తనకు తానే శిక్ష వేసుకున్నాడు. మరోవైపు, తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ ఏమిటంటూ హమీదా-శ్రీరామచంద్ర చర్చించుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

అసలు హౌస్‌లో ఏం జరిగిందంటే.. ‘అతికిందంటే అదృష్టమే’ పేరుతో బిగ్‌బాస్‌ హౌస్‌లో శుక్రవారం లగ్జరీ బడ్జెట్‌ టాస్క్‌ జరిగింది. లగ్జరీ బడ్జెట్‌ కోసం సన్నీ, రవి, శ్రీరామచంద్ర బాగానే ప్రయత్నించారు. అనంతరం ఈ వారం బెస్ట్‌, వరెస్ట్‌ పెర్‌ఫార్మెన్స్ ఎవరిదో చెప్పాల్సిందిగా ఇంటి సభ్యులకు బిగ్‌బాస్‌ సూచించాడు. వారంలో జరిగిన మొత్తాన్ని తీసుకోకుండా అరగంట ముందు హమీదా చేసిన పనిని పట్టుకుని కెప్టెన్‌ జెస్సీ ఆమెను వరెస్ట్‌ పెర్ఫార్మర్‌గా నామినేట్‌ చేశాడు. గడిచిన వారం రోజుల్లో తన ప్రదర్శన తనకే సరిగ్గా నచ్చలేదంటూ మానస్‌ సెల్ఫ్‌ నామినేట్‌ చేసుకున్నాడు. అయితే, సెల్ఫ్‌ నామినేషన్‌ చేసుకోవడం కుదరదని జెస్సీ చెప్పడంతో.. వెంటనే అతడినే నామినేట్‌ చేశాడు. మానస్‌ సెల్ఫ్‌ నామినేషన్‌ చేసుకోవడంతో ఛాన్స్‌ దొరికింది కదా అని.. ఏ కారణాల్లేవంటూనే ఎక్కువమంది ఇంటి సభ్యులు ఆయన్నే నామినేట్‌ చేశారు. ‘మానస్‌’ వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ అని అత్యధిక మంది చెప్పడంతో జెస్సీ అతడిని జైలులో వేశాడు. ‘అందరూ తినడమే కాదు.. వంటలో కూడా సాయం చేయాలి.. 16 మందికి వంట చేస్తున్నప్పుడు సాయం చేయకుండా కబుర్లు చెప్పుకోడం ఏం బాగోలేదు’ అంటూ ఇంటి సభ్యులపై శ్వేతావర్మ మండిపడింది. దీంతో ఇంటి సభ్యులందరూ మేము పనిచేస్తున్నాంగా అంటూ ఒకరితో ఒకరు చెప్పుకొని వాపోయారు.

మాటవినని హౌస్‌మేట్స్‌‌.. శిక్ష వేసుకున్న కెప్టెన్‌

ఇంటి సభ్యులందరూ రూల్స్‌ పాటించకుండా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు వ్యవహరిస్తున్నారంటూ కెప్టెన్‌ జెస్సీ అసహనం వ్యక్తం చేశాడు. అందర్నీ లివింగ్‌ రూమ్‌లోకి పిలిచి పంచాయతీ పెట్టాడు. ‘మీరు రూల్స్‌ పాటించడం లేదు.. అందుకే గుంజీలు తీస్తున్నా’ అని మొదలు పెట్టడంతో ఆశ్చర్యపోవడం ఇంటి సభ్యులు వంతు అయ్యింది. రవి, కల్పించుకుని.. ‘నువ్వు కెప్టెన్‌వి. ఆదేశాలు జారీ చేయలి. కానీ నిన్ను నువ్వు శిక్షించుకోకూడదు. నువ్వు చెప్పింది అందరూ పాటించాల్సిందే’ అని గట్టిగా చెప్పాడు.

కొంతమంది వ్యక్తులు గ్రూప్‌గా చేరి తనపై ఏదో స్కెచ్‌ వేస్తున్నారని.. సమయం వచ్చినప్పుడు వాళ్ల అంతు తేలుస్తానంటూ నటరాజ్‌ మాస్టర్ ఊగిపోయాడు. దాంతో ఆ వ్యక్తి ఎవరో చెప్పాలని సన్నీ కోరగా.. ‘అన్నింటికీ సమయం రావాలి. టైమ్‌ వచ్చినప్పుడు తప్పకుండా చెబుతా’ అని సమాధానం ఇచ్చాడు. ఆతర్వాత బిగ్‌బాస్‌.. ఓ చిన్నపిల్లాడి బొమ్మను ఇంట్లోకి ముఖ్య అతిథిగా పంపిస్తాడు. అది ఏడవకుండా చూసుకోవాలంటూ సభ్యులకు సూచించాడు. ఈ సందర్భంగా, నటరాజ్‌ మాస్టర్‌ సతీమణి సీమంతం వీడియోని ప్రసారం చేయడంతో ఆయన భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. మరోవైపు తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ ఏమై ఉంటుందని హమీదా-శ్రీరామచంద్రలు చర్చించుకున్నారు. ‘నువ్వు నాకు ఇంతలో దగ్గరై.. అంతలో దూరమవుతున్నావు. అస్సలు నాకేమీ అర్థం కావడం లేదు’ అని హమీదా అనడంతో.. ‘సన్నీ, మానస్‌లు నీకు మంచి స్నేహితులు కావడం వల్ల ప్రతి విషయంలోనూ మీ మధ్య స్పష్టత ఉంది. నువ్వు-నేను ఫ్రెండ్స్ కాదు. అంతకు మించి మన మధ్య ఏమైనా ఉందేమో. ప్రస్తుతం మన బంధం ప్రశ్నార్థకంగా ఉంది. అది తెలిస్తేనే మన బంధంపై స్పష్టత వస్తుంది’ అని శ్రీరామ చంద్ర వివరణ ఇచ్చాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని