Bigg Boss Telugu 5: ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్నది వీళ్ళే.. - telugu news bigg boss telugu 5 fourt week nominations
close
Updated : 28/09/2021 09:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg Boss Telugu 5: ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్నది వీళ్ళే..

హైదరాబాద్‌: రోజులు గడిచేకొద్దీ బుల్లితెర రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ ఆసక్తికరంగా మారుతోంది. నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్‌ ప్రక్రియ సోమవారం ముగిసింది. ఎప్పటిలాగే వాదోపవాదాలు, సుదీర్ఘ చర్చల మధ్య నామినేషన్స్‌ ముగిశాయి. ఇంట్లో ఉండేందుకు అర్హతలేని ఇద్దరు వ్యక్తులను ఎంచుకుని, తగిన కారణాలు చెప్పి వారి ఫొటోలోని కొంత భాగాన్ని తీసి స్విమ్మింగ్‌ పూల్‌లో పడేయాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు. దీంతో హౌస్‌మేట్స్‌ నామినేషన్‌ ప్రక్రియకు ఉపక్రమించారు. లోబో-ప్రియల మధ్య గట్టి వాదనే జరిగింది. ‘నా ప్రేమ కథను సినిమా స్టోరీ అంటావా’ అంటూ లోబో ఓ దశలో తన సహనాన్ని కోల్పోయి ప్రియపై కేకలు పెట్టాడు. ఆ తర్వాత ఇద్దరూ వెక్కి వెక్కి ఏడ్చారు.

విశ్వ-నటరాజ్‌ల మధ్య కూడా మాటల తీవ్రత బాగానే సాగింది. ‘సింహంతో వేట ఈ నటరాజ్‌తో ఆట మంచిది కాదు’ అంటూ నటరాజ్‌ మీసాలు తిప్పాడు. ‘అలాంటివన్నీ హౌస్‌ బయట చూసుకో’ అంటూ విశ్వ కౌంటర్‌ ఇచ్చాడు. మరికొందరు  చిన్న చిన్న కారణాలు చెప్పి తోటి హౌస్‌మేట్స్‌ నామినేట్‌ చేశారు. రెండో వారంలో జరిగిన వారి మధ్య చోటు చేసుకున్న సంఘటనలు, వంటింట్లోకి రావొద్దని హమీదను నటరాజ్‌ అనడం, రవి మెడపై కాజల్‌ కొట్టిందని, గేమ్‌ ఇంకా బాగా ఆడాలని, నామినేషన్స్‌లో ఉంటే ఎలా భయపడతావో చూపిస్తానని ఇలా ఒక్కోక్కరూ ఒక్కో కారణం చెప్పారు. అత్యధికమంది లోబోను నామినేట్ చేయగా, ఆ తర్వాత నటరాజ్‌, రవి, ప్రియ, కాజల్‌, సిరి, సన్నీ, అనీలు నామినేషన్స్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఇంట్లో 16మంది సభ్యులు ఉండగా, 8మంది అంటే సగం మంది ఈ వారం నామినేషన్స్‌లో ఉండటం గమనార్హం.

ఇంకా ఆ టాపిక్‌ వదలని రవి..

గతవారం జరిగిన చేదు అనుభవాలను రవి ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. నామినేషన్స్‌ సందర్భంగా ప్రియ-లహరి-రవిల మధ్య జరిగిన గొడవకు పశ్చాత్తాపపడ్డాడు. ‘మీ ఎదురుకుండా తలెత్తుకుని నిలబడటానికి కూడా సిగ్గుగా ఉంది. శనివారం నా జీవితంలో అత్యంత దుర్దినం. ఈ విషయంలో ముగ్గురికి ప్రియ, లహరి, మా అమ్మకు క్షమాపణ చెప్పాలి. ప్రియతో నేను ఆ మాట చెప్పిన నేను ఆ తర్వాత చెప్పలేదంటూ మా అమ్మపై ఒట్టు వేశా. దానికంటే దారుణం ఏదీ ఉండదు. అలా ఒక పురుషుడు మాట్లాడకూడదు. లహరి ఇక్కడ లేదు. ఉన్నా తనతో మాట్లాడి ఈ వివాదానికి ముగింపు పలికేవాడిని’అంటూ క్షమాపణలు అడిగాడు.

ఇక్కడి వరకూ బాగానే ఉన్నా, నటరాజ్‌ను నామినేట్‌ చేస్తూ గుంటనక్క తననే అంటున్నారని అనవసరంగా మాట్లాడి ఇరుక్కుపోయాడు. ‘మీరు నన్ను గుంటనక్క అంటున్నారని నాకు అనిపిస్తోంది. అందుకే మిమ్మల్ని నామినేట్‌ చేస్తున్నా’ అని నటరాజ్‌ మాస్టర్‌తో అనగా ‘నేను నిన్నే అన్నానని నువ్వు ఎలా భావిస్తావు. గుమ్మడికాయల దొంగ అంటే నువ్వెందుకు భుజాలు తడుముకుంటున్నావు. నిన్ను మాత్రమే అన్నానని నువ్వు అనుకుంటున్నావు కదా! ఎందుకు ఆ మాట అన్నానో నువ్వే కారణం చెప్పు. ఒకవేళ నువ్వు అలా భావిస్తే అలాగే అనుకో.’ అంటూ రవికి నటరాజ్‌ ఎదురు కౌంటర్‌ ఇచ్చారు. మరి నామినేషన్స్‌లో ఉన్న వాళ్లలో ఎవరు సేఫ్‌ అవుతారు?ఎవరు ఎలిమినేట్‌ అవుతారు? తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని