Allu Arjun: సాయిధరమ్‌ తేజ్‌ని పరామర్శించిన అల్లు అర్జున్‌ - telugu news allu arjun met saidharam tej
close
Published : 16/09/2021 19:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Allu Arjun: సాయిధరమ్‌ తేజ్‌ని పరామర్శించిన అల్లు అర్జున్‌

హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదానికి గురై జూబ్లిహిల్స్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న సాయిధరమ్‌ తేజ్‌ని అల్లు అర్జున్‌ పరామర్శించారు. సాయిధరమ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. సాయితేజ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అల్లు అర్జున్‌ ‘పుష్ప’ సినిమా చిత్రీకరణ కోసం గత కొన్ని రోజులుగా కాకినాడలో ఉన్నారు. గురువారం హైదరాబాద్‌ చేరుకుని, సాయిధరమ్‌ తేజ్‌ వద్దకి వెళ్లారు. ఈ నెల 10న తన స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయిధరమ్‌తేజ్‌ ప్రమాదవశాత్తూ కిందపడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రగాయాలవగా ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ను అపోలో ఆసుపత్రికి తరలించారు. కాలర్‌ బోన్‌ సర్జరీ విజయవంతంగా పూర్తిచేశామని, ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు ఇటీవల తెలిపాయి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని