మళ్లీ ‘గల్లీబాయ్‌’ జంటే! - telugu news alia ranveer singh to star in sanjay leela bhansali baiju bawra
close
Published : 25/09/2021 10:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మళ్లీ ‘గల్లీబాయ్‌’ జంటే!

సినిమా సెట్స్‌పైకి వెళ్లే వరకూ ప్రముఖ దర్శకుల చిత్రాల్లో నటీనటులకు సంబంధించి పేర్లు మారుతూనే ఉంటాయి. ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ‘బైజు బవ్రా’పేరుతో ఓ చిత్రం తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో రణ్‌బీర్‌ కపూర్, దీపికా పదుకొణె జంటగా నటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ప్రధాన పాత్రలో రణ్‌వీర్‌సింగ్‌ను ఓకే చేసినట్టు తెలుస్తోంది. ఆయనకు జోడీగా అలియాభట్‌ నటించనున్నట్టు సమాచారం. ఈ ఇద్దరూ కలిసి నటించిన ‘గల్లీబాయ్‌’ మంచి విజయం సాధించింది. ‘‘ఈ చిత్రంలోని పాత్రకు ఓ విధమైన పిచ్చి ఉంటుంది. అలాంటి పాత్రకు రణ్‌వీర్‌ అయితేనే సరిగ్గా సరిపోతాడని భన్సాలీ ముందు నుంచే అనుకుంటున్నారు. ఇక అలియా ఈ కథ చదివి ఎంతో ఆసక్తిని కనబరిచారు’’అని భన్సాలీ సన్నిహిత వర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది. అలియా ప్రధాన పాత్రలో భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రం థియేటర్లలో విడుదల కోసం వేచిచూస్తోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని