తీయటి తలనొప్పి
ఇంటా బయటా అద్భుత విజయాలు.. టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంకు.. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ చక్కటి ఫలితాలు.. టీమ్ఇండియాకు ఎదురే లేదు. అభిమానుల ఆనందానికి అవధులే లేవు! ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత్ అత్యుత్తమ జట్టు అనడానికి కేవలం ఫలితాలు మాత్రమే రుజువు కాదు. వివిధ ఫార్మాట్లలో ఎటు చూసినా ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లతో కళకళలాడుతున్న భారత్.. ప్రపంచంలోనే మరే జట్టుకూ లేనంత బలమైన రిజర్వ్ బెంచ్‌తో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఆ రకంగానూ ప్రపంచ ఉత్తమ జట్టు అనిపిస్తోంది.
కొన్ని నెలల కిందట భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఏమైందో అందరికీ తెలిసిందే. గాయాలు, ఇతర కారణాలతో భారత ఆటగాళ్లు ఒక్కొక్కరుగా జట్టుకు దూరమవుతుంటే.. ఒక దశలో తుది జట్టుకు పదకొండు మంది ఆటగాళ్లను కూడా వెతుక్కోవాల్సిన స్థితిలో భారత్ పడింది. నెట్స్‌లో సాయం చేయడానికి జట్టుతో పాటు ఉన్న నటరాజన్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్లను తుది జట్టులోకి చేర్చింది. తుది జట్టులో అవకాశమే దక్కదనుకున్న శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, రిషబ్ పంత్‌లు సైతం మ్యాచ్‌లు ఆడారు. ఇలా రిజర్వ్ బెంచ్‌లో ఉన్న ఆటగాళ్లే తర్వాత తుది జట్టులో కీలకంగా మారారు. మ్యాచ్ విన్నర్లు కూడా అయ్యారు. అడిలైడ్ పరాభవం తర్వాత మెల్బోర్న్లో భారత్ గొప్పగా పుంజుకోవడంలో సిరాజ్‌ది కీలక పాత్ర. తొలి టెస్టుకు రిజర్వ్ ఆటగాడిగా ఉన్న అతను.. ఉమేశ్ గాయపడటంతో తుది జట్టులోకొచ్చి అయిదు కీలక వికెట్లతో సత్తా చాటాడు. అక్కడి నుంచి వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఇదే సిరీస్‌లో నటరాజన్, శార్దూల్, సుందర్ సైతం ఇలాగే అనుకోకుండా జట్టులోకి వచ్చారు. ముగ్గురూ రాణించి సిరీస్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. ఇక సాహాకు ప్రత్యామ్నాయంగా ఉన్న పంత్.. రెండో టెస్టు నుంచి అతడి స్థానంలో జట్టులోకి వచ్చి సిడ్నీ, బ్రిస్బేన్ టెస్టుల్లో ఎలా అదరగొట్టాడో తెలిసిందే. తాజాగా ముగిసిన ఇంగ్లాండ్‌తో టెస్టుల్లోనూ రిజర్వ్ ఆటగాళ్ల జోరు కొనసాగింది. రెండో టెస్టు నుంచి అవకాశం దక్కించుకున్న అక్షర్ పటేల్.. సీనియర్ స్పిన్నర్ అశ్విన్‌కు దీటుగా వికెట్లు పడగొట్టి సిరీస్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అక్షర్ అసలు టెస్టు మ్యాచ్‌లో ఆడతాడనే ఎవరూ అనుకోలేదు. జడేజాకు గాయం కావడంతో అనుకోకుండా అతను జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు జడ్డూకే తుది జట్టులో చోటును ప్రశ్నార్థకం చేశాడు.
వన్డేలు, టీ20ల్లో ఇంకా..
టెస్టులు అనే కాదు.. పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ భారత్‌కు తిరుగులేని రిజర్వ్ బెంచ్ ఉంది. లెక్కలేనంత మంది యువ ఆటగాళ్లు భారత జట్టు తలుపు తడుతున్నారు. టీ20ల్లో కొత్త కుర్రాళ్లకు విరివిగా అవకాశాలు లభిస్తున్నాయి. ఒక్క ఐపీఎల్ సీజన్లో రాణించడంతో నటరాజన్ దశ తిరిగిపోయింది. భారత జట్టు తరఫున వన్డేలు, టీ20ల్లో సత్తా చాటి తనపై అంచనాలు పెంచేశాడు. ఫాస్ట్బౌలర్లలో బుమ్రా, షమి, భువనేశ్వర్ లాంటి సీనియర్లకు తోడు.. దీపక్ చాహర్, నవదీప్ సైని, నటరాజన్, శార్దూల్ ఠాకూర్ల రూపంలో బోలెడన్ని ప్రత్యామ్నాయాలున్నాయి భారత్‌కు. సిరాజ్ సైతం పరిమిత ఓవర్ల క్రికెట్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఆల్‌రౌండర్ల విషయంలోనూ భారత్‌కు లోటే లేదు. జడేజా, హార్దిక్ పాండ్య రెగ్యులర్ ఆటగాళ్లు కాగా.. వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాతియా, అక్షర్ పటేల్‌లతో రిజర్వ్ బెంచ్ బలంగా ఉంది. కృనాల్ పాండ్య సైతం వీరికి పోటీదారే. స్పెషలిస్టు స్పిన్నరే కావాలనుకుంటే.. చాహల్‌కు తోడు కొత్తగా వరుణ్ చక్రవర్తి అందుబాటులోకి వచ్చాడు. కుల్దీప్ యాదవ్ రూపంలోనూ ఓ ప్రత్యామ్నాయం ఉంది. ఈ పోటీలో అశ్విన్ లాంటి సీనియర్‌కు వన్డేలు, టీ20ల్లో చోటు లేకుండా పోయింది. బ్యాటింగ్‌లో అయితే పోటీ మామూలుగా లేదు. రెగ్యులర్ ఆటగాళ్లలో ఎవరినీ తప్పించే పరిస్థితి లేకపోగా.. ఐపీఎల్ మెరుపులతో కొత్తగా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ లాంటి కుర్రాళ్లు భారత జట్టు తలుపు తట్టారు. మనీష్ పాండే సైతం పోటీలో ఉన్నాడు. ఇంకా దేశవాళీల్లో నిలకడైన ప్రదర్శనతో ఎంతోమంది కుర్రాళ్లు భారత జట్టులో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.
ఓపెనర్లే ఓపెనర్లు
సాధారణంగా ప్రతి ఫార్మాట్‌కూ ఏ జట్టయినా ఇద్దరు రెగ్యులర్ ఓపెనర్లకు తోడు ఒక రిజర్వ్ ఓపెనర్‌ను అందుబాటులో ఉంచుకుంది. కానీ భారత్‌కు ఇటు టెస్టుల్లో, అటు వన్డేల్లో బోలెడంతమంది ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. కొన్నేళ్ల ముందు వరకు టెస్టుల్లో ధావన్, విజయ్ రెగ్యులర్ ఓపెనర్లుగా ఉండేవాళ్లు. వీళ్లిద్దరిలో ఎవరు అందుబాటులో లేకున్నా రాహుల్ ఓపెనింగ్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఈ ముగ్గురికీ తుది జట్టులో చోటు లేదు. మధ్యలో మయాంక్ అగర్వాల్, పృథ్వీ అవకాశం దక్కించుకుని కొన్నాళ్లు సత్తా చాటారు. ఇంతలో రోహిత్ మిడిలార్డర్ నుంచి టెస్టుల్లోనూ ఓపెనర్ అవతారం ఎత్తాడు. ఈ పాత్రలో అతను నిలకడగానే ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాలో మయాంక్, పృథ్వీ ఇద్దరూ విఫలం కావడంతో రోహిత్‌కు తోడుగా గిల్‌కు అవకాశం దక్కింది. అతను రాణించి ఓపెనింగ్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు. మయాంక్, పృథ్వీ, రాహుల్‌ల రూపంలో ప్రత్యామ్నాయాలున్నాయి. వన్డేల విషయానికొస్తే.. ప్రస్తుతం రోహిత్, రాహుల్ రెగ్యులర్ ఓపెనర్లుగా ఉన్నారు. మధ్యలో గాయాలతో, నిలకడ తప్పి జట్టుకు దూరమైన ధావన్ సైతం.. మళ్లీ ఫామ్ అందుకుని జట్టులోకి వచ్చాడు. మయాంక్, పృథ్వీ సైతం పరిమిత ఓవర్ల జట్లలో చోటు కోసం పోటీలో ఉన్నారు.
తుది జట్టులోకి ఎవరిని ఎంచుకోవాలి.. ఇదీ ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో టీ20ల ముంగిట భారత జట్టు యాజమాన్యాన్ని వేధిస్తున్న ప్రశ్న. ఇది ఒక రకంగా కోహ్లి, రవిశాస్త్రికి తీయటి తలనొప్పే. ఎవరిని ఆడించాలో, ఎవరిని పక్కన పెట్టాలో తెలియక ఈ సిరీస్‌లో వీళ్లిద్దరూ సతమతం కావడం ఖాయం.
అహ్మదాబాద్: ఇంగ్లాండ్‌తో టీ 20 సిరీస్ కోసం ఎంపిక చేసిన 19 మందిలో రెగ్యులర్ ఆటగాళ్లు కాకుండా మిగతా వాళ్లందరూ ప్రతిభావంతులే. అందరూ ఫామ్‌లో ఉన్నారు. ప్రతి ఒక్కరూ తుది జట్టులో చోటు దక్కించుకోవడానికి అర్హులే. వీరిలోంచి తుది 11 మందిని ఎంపిక చేయడం ఇప్పుడు కోహ్లి, రవిశాస్త్రి ముందున్న సవాల్. రోహిత్‌కు తోడుగా ఓపెనర్‌గా రాహుల్‌నే కొనసాగిస్తారా.. విజయ్ హజారె ట్రోఫీలో, అంతకుముందు ఐపీఎల్లో అదరగొట్టిన ధావన్‌ను ఆడిస్తారా అన్నది అన్నది ఆసక్తికరం. కొత్తగా జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లకు ఇవ్వడానికి ఏ స్థానం ఖాళీగా లేదు. నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్ స్థిరపడిపోయాడు. తర్వాతి స్థానాల్లో పంత్, పాండ్య ఆడే అవకాశముంది. స్పిన్ ఆల్‌రౌండర్ స్థానం కోసం రాహుల్ తెవాతియా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్‌ల మధ్య పోటీ ఉంది. జడేజా లేకపోవడం వల్ల వీరిలో ఒకరికి చోటు ఖాయం. కానీ ఆ ఒక్కరు ఎవరన్నది ఆసక్తికరం. స్పెషలిస్టు స్పిన్నర్‌ను ఎంచుకోవాలనుకుంటే సీనియర్ చాహల్‌నే ఎంపిక చేస్తారా.. రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తిల్లో ఒకరికి అవకాశం ఇద్దామనుకుంటారా అన్నది చూడాలి. పేసర్లను ఎంచుకోవడంలోనూ తలనొప్పి తప్పేట్లు లేదు. గాయం నుంచి కోలుకున్న సీనియర్ ఫాస్ట్‌బౌలర్ భువనేశ్వర్‌కు తోడు నటరాజన్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనిల నుంచి ఇద్దరినే ఎంచుకోవడం అంత తేలిక కాదు. ఇది అయిదు మ్యాచ్‌ల సిరీస్ కాబట్టి.. ముందు రెగ్యులర్ ఆటగాళ్లకు అవకాశమిచ్చి.. తర్వాత రొటేషన్ చేసే అవకాశముంది.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- వీరభద్రం దర్శకత్వంలో ఆది
-
Gully Rowdy Teaser: నవ్వులే నవ్వులు
-
అనసూయ చిత్రం విడుదలకు సిద్ధం
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
గుసగుసలు
-
‘రాధేశ్యామ్’లో పూజా పాత్ర అదేనా?
- వెంకటేష్, వరుణ్‌తేజ్ చిత్రంలో అంజలి!
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
రివ్యూ
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..
-
‘ఇష్క్’ నుంచి ‘ఆగలేకపోతున్నా..’