Remix Special: ఇదేం క్రియేటివిటీరా బాబు! - some bengali songs inspired from tollywood
close
Published : 18/05/2021 09:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Remix Special: ఇదేం క్రియేటివిటీరా బాబు!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘సీటీమార్‌’.. ‘దువ్వాడ జగన్నాథం’లో ఈ పాటకు అల్లు అర్జున్‌ వేసిన స్టెప్పులు చూస్తే ఎవరైనా వావ్‌ అనాల్సిందే. ఇప్పుడు ఇదే పాటకు ‘రాధే’లో సల్మాన్‌ స్టెప్పులేసి అందర్నీ ఒకింత ఆశ్చర్యపరిచారు. ఎంతో ఎనర్జీటిక్‌గా సాగే ఆ పాటకు సల్లూబాయ్‌ చేసిన డ్యాన్స్‌కు ఆయన అభిమానులు ఓకే చెప్పినా.. నెటిజన్లు మాత్రం సెటైర్లు వేస్తున్నారు. ఇటీవల ఈ పాట యూట్యూబ్‌లో 100 మిలియన్ల వ్యూస్‌ని సైతం సొంతం చేసుకుంది. మరోవైపు తెలుగు పాటల నుంచి ప్రేరణ పొందిన కొన్ని బెంగాలీ పాటలు ఉన్నాయి. ఆ పాటలను వాళ్లు ఎలా రీమేక్‌ చేశారో మీరూ చూడండి.. ఈ వీడియోలను చూసిన కొందరు ఇదేం క్రియేటివిటీరా బాబు అనకుండా ఉండలేకపోతున్నారు.

గ్యాంగ్‌లీడర్‌ - రచ్చ - బాబీ

‘గ్యాంగ్‌లీడర్‌’లో చిరంజీవి-విజయశాంతి చేసిన వాన పాట అంటే నచ్చని వాళ్లుండరు. అదే పాటను రామ్‌చరణ్‌-తమన్నా నటించిన ‘రచ్చ’ కోసం రీమేక్‌ చేశారు. ‘వానా వానా ’ అంటూ సాగే ఆ పాట కోసం ఈ జోడీ చేసిన డ్యాన్స్‌ చూసి అందరూ ఫిదా అయ్యారు. కాగా, ఇదే పాటను 2013లో విడుదలైన బెంగాలీ చిత్రం ‘బాబీ’ కోసం రీమేక్‌ చేశారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. తెలుగులో రామ్‌చరణ్‌-తమన్నా ఎలాంటి క్యాస్టూమ్స్‌లో కనిపించారో దాదాపు అదే తరహా దుస్తుల్లో బెంగాలీ తారలు కనిపిస్తారు. డ్యాన్స్‌ కూడా అక్కడక్కడా ఒకేలా అనిపించకుండా ఉండదు.


ఆర్య2 - అజబ్‌ ప్రేమ్‌

అల్లు అర్జున్‌ నటించిన ‘ఆర్య-2’లోని ‘మై లవ్‌ ఈజ్‌ గాన్‌’ అప్పట్లో యువతని బాగా ఆకర్షించింది. ఇదే పాటను 2015లో విడుదలైన ‘అజబ్‌ ప్రేమ్‌’ అనే సినిమాలో రీ క్రియేట్‌ చేశారు. ఈ పాటలో ‘మై లవ్‌ ఈజ్‌ గాన్‌’ అంటూ హీరో వేసే స్టెప్పులు చూస్తే.. ‘ఇదేమి డ్యాన్స్‌ సామీ’ అనకుండా ఉండరు.


రామయ్యా వస్తావయ్యా - గూండా

తారక్‌ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘రామయ్యా వస్తావయ్యా’. ఇందులో సామ్‌కు తన ప్రేమను తెలుపుతూ ఎన్టీఆర్‌ పాడే పాట ‘ఓ లైలా...’.. మంచి బీట్‌తో అలరించింది. అదే పాటను 2015లో విడుదలైన ‘గూండా’లో రీమేక్‌ చేశారు. ‘ఓ మై హార్ట్‌’ అంటూ హీరో,హీరోయిన్స్ వేసే డ్యాన్స్‌ చూస్తే నవ్వకుండా ఉండలేరేమో.


ఆర్య - నం:1 షకీబ్‌ ఖాన్‌

అల్లు అర్జున్‌ నటించిన ‘ఆర్య’లో ‘యూ రాక్‌ మై వరల్డ్‌’ సాంగ్‌ అందరితో డ్యాన్స్ చేయించింది. దేవిశ్రీ సంగీతం అందించిన అదే పాటను 2010లో విడుదలైన ‘నం:1 షకీబ్‌ ఖాన్‌’లో రీమేక్‌ చేశారు. ఈ పాటలో హీరో బీచ్‌లో డ్యాన్స్‌ చేస్తుంటే.. అది చూసిన నెటిజన్ల పొట్టచెక్కలు కావడం ఖాయం.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని