Viral: అక్షయ్‌ బ్యాటింగ్‌.. షారుఖ్‌ కీపింగ్‌.. - shah rukh khan and akshay kumar photo goes viral on internet
close
Updated : 22/06/2021 18:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Viral: అక్షయ్‌ బ్యాటింగ్‌.. షారుఖ్‌ కీపింగ్‌..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడో ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అక్షయ్‌కుమార్‌, షారుఖ్‌ఖాన్.. ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్‌లో ఉండి.. అది ఇప్పటి వరకూ చూడనిది అయ్యుండి.. పైగా వాళ్లిద్దరూ క్రికెట్‌ ఆడుతుంటే వైరల్‌ కాకుండా ఎలా ఉంటుంది..! సుమారు పాతికేళ్ల క్రితం షారుఖ్‌ హీరోగా ‘దిల్‌ తో పాగల్‌ హై’ చిత్రం విడుదలైంది. ఆ సినిమా చిత్రీకరణ సందర్భంగా.. విరామ సమయంలో అక్షయ్‌కుమార్‌, షారుఖ్‌ఖాన్‌ క్రికెటర్లుగా అవతారం ఎత్తారు. అక్షయ్‌ బ్యాటింగ్‌ చేయగా.. షారుఖ్‌ వికెట్ల(కుర్చీ) వెనక కీపింగ్‌ చేస్తూ ఆ ఫొటోలో కనిపించారు. ఇద్దరు స్టార్‌ హీరోలు ఒకే ఫొటోలో కనిపించడంతో ఇప్పుడీ ఫొటో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. 1997లో వచ్చిన ‘దిల్‌ తో పాగల్‌ హై’ చిత్రం బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. అందులో షారుఖ్‌, మాధురి దీక్షిత్‌, కరిష్మాకపూర్‌ నటించారు.

చివరిగా 2018లో ‘జీరో’తో ప్రేక్షకులను అలరించిన షారుఖ్‌.. చాలాకాలం విరామం తర్వాత మళ్లీ సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. షారుఖ్‌ తర్వాతి చిత్రం ‘పఠాన్‌’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ చిత్రంలో షారుఖ్‌కు జోడీగా దీపిక పదుకొణెతో కలిసి ఆడిపాడనుంది. మరోవైపు అక్షయ్‌కుమార్‌ సైతం వరుస చిత్రాలతో యమ బిజీగా ఉన్నారు. ‘పృథ్వీరాజ్‌ చౌహాన్‌’గా తెరకెక్కుతున్న బయోపిక్‌లో నటిస్తున్నాడు. బెల్‌బాటమ్‌, బచ్చన్‌పాండే, సూర్యవంశీ చిత్రాలతో పాటు ఆత్రంగి రే సినిమాలో సారా అలీఖాన్‌, ధనుష్‌తో కలిసి సందడి చేయనున్నాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని