Samantha: ఇప్పుడిదే నాకు చక్కటి తోడు! - samantha cycling in rain hyderabad
close
Updated : 27/09/2021 20:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Samantha: ఇప్పుడిదే నాకు చక్కటి తోడు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అగ్ర కథానాయిక సమంత సినిమాలతో సందడి చేయడమే కాదు..  కాస్త సమయం దొరికితే తనకు నచ్చిన పనుల్లో నిమగ్నమైపోతుంది. సోమవారం ఉదయం హైదరాబాద్‌ నగరంలో వర్షం పడుతుండగా.. పారా సైక్లిస్ట్స్‌తో కలిసి సైకిల్‌ రైడ్‌కి వెళ్లారామె. ఈ సందర్భంగా వారితో కలిసి సైకిల్‌ తొక్కుత్కున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘‘ ప్రతీ రోజూ ఈ పారా సైక్లిస్ట్స్‌, సైకిలింగ్‌ .. నాకు స్ఫూర్తి. వర్షంలో వీరితో కలిసి ఇలా సైకిల్‌ తొక్కడం.. అదే ఓ చక్కటి తోడు. తొలిరోజే 21కిలోమీటర్లు తొక్కాను.. త్వరలోనే వంద కిలో మీటర్లను చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నా’’ అని తెలిపారు.

ఇటీవలే షూటింగ్స్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్న సమంత తన స్నేహితులు కీర్తిసురేష్‌, త్రిష, కల్యాణి ప్రియదర్శన్‌తో సరదాగా గడిపారు. తన పెంపుడు కుక్క పిల్లలు హ్యాష్‌, సాషా విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటున్నారు.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని