Corona: ఆర్ఆర్‌ఆర్‌ వినూత్న ప్రచారం - rrr awareness on corona virus
close
Published : 06/05/2021 15:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Corona: ఆర్ఆర్‌ఆర్‌ వినూత్న ప్రచారం

తమిళంలో మాట్లాడిన చరణ్‌.. కన్నడలో తారక్‌..

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా విలయతాండవంతో దేశంలో పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. లక్షల సంఖ్యలో కేసులు.. వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఆసుపత్రల్లో ఎక్కడ చూసినా కరోనా బాధితుల ఆక్రందనలే వినిపిస్తున్నాయి. కరోనాను ఎదుర్కోవాలంటే సరైన అవగాహనతోపాటు ధైర్యం మన దగ్గరున్న మార్గాలు. అందుకే సినీ ప్రముఖులంతా కరోనాపై అవగాహన కల్పించేందుకు తమవంతు కృషి చేస్తున్నారు. తాజాగా.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ వినూత్న రీతిలో ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేసింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో మాట్లాడిన వీడియోను యూట్యూబ్‌లో #StandTogether పేరుతో పంచుకుంది. అందులో ఆలియా భట్‌ తెలుగులో.. రామ్‌చరణ్‌ తమిళంలో.. ఎన్టీఆర్‌ కన్నడలో.. రాజమౌళి మలయాళంలో.. అజయ్‌దేవ్‌గణ్‌ హిందీలో మాట్లాడుతూ.. కరోనాపై జాగ్రత్తలు చెప్పారు. పొరుగు రాష్ట్రాల ప్రజలకు తమ సందేశం చేరాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

‘అందరికీ నమస్కారం.. సెకండ్‌ వేవ్‌లో భాగంగా దేశంలో కరోనా కేసులు రికార్డుస్థాయిలో పెరుగుతున్నాయి. గతేడాది కలిసిగట్టుగా ఉండి కరోనాకు వ్యతిరేకంగా ఎంతో పోరాడాం. మళ్లీ అలాగే పోరాడదాం. మాస్కు ధరించడం.. చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవడం.. జనంలోకి వెళ్లినప్పుడు సామాజిక దూరం పాటించడమే కరోనాపై పోరాడేందుకు మన దగ్గర ఉన్న ఆయుధాలు. వ్యాక్సిన్‌పై వస్తున్న అపోహలను నమ్మకండి. మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను టీకా వేయించుకొనేలా ప్రోత్సహించండి. ఈ సమయంలో ఇంట్లోనే ఉండటం ఎంతో ముఖ్యం. అత్యవసరమైతేనే బయటికి వెళ్లండి. మాస్కు పెట్టుకోవడంతో పాటు టీకా వేయించుకుంటానని ప్రతిజ్ఞ చేద్దాం. మాస్క్‌ ధరిద్దాం.. వ్యాక్సిన్‌ వేయించుకుందాం’ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు.

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అందులో తారక్‌, రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చరణ్‌కు జోడీగా ఆలియాభట్‌, తారక్‌ సరసన ఒలివియా మోరిస్‌ కనిపించనుంది. బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవ్‌గణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డి.వి.వి దానయ్య నిర్మాత. ఈ చిత్రం 2021 అక్టోబర్‌ 13న విడుదల కావాల్సి ఉంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని