గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

హైహీల్స్‌ వేసుకున్నా నాకన్నా ఎత్తుండాలి

రకుల్‌ప్రీత్‌ సింగ్‌

ముంబయి: తెలుగు చిత్రపరిశ్రమలో అగ్రకథానాయులకు జోడిగా నటించి స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకున్నారు రకుల్‌ప్రీత్ ‌సింగ్‌. ఇటు టాలీవుడ్‌లో పాపులారిటీ తెచ్చుకోవడంతోపాటు.. అప్పుడప్పుడు బాలీవుడ్‌, కోలివుడ్‌లోనూ తళక్కున మెరుస్తోంది. తన అందం, అభినయంతో యువకుల గుండెల్లో గూడు కట్టుకున్న రకుల్‌.. తనకు కాబోయే భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండాలో వెల్లడించారు. ప్రేమ, వివాహ వ్యవస్థ గురించి తన అభిప్రాయాలను ఓ ఇంటర్య్వూలో తెలిపారు.

‘‘ప్రేమ, వివాహ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకముంది. వివాహమనేది ఒక అందమైన అనుభూతి. కానీ, కొంత మంది వివాహం అనగానే ఒత్తికి గురవుతుంటారెందుకో నాకర్థం కాదు. ఎవరినైనా ప్రేమిస్తే.. మనస్ఫూర్తిగా ప్రేమించాలి. నేను అలాంటి అమ్మాయిని. నాకు కాబోయే వాడు నాకన్న ఎత్తు ఎక్కువగా ఉండాలి. నేను హైహీల్స్‌ వేసుకున్నా నేను అతడిని తలెత్తుకునే చూడాలి. అంత ఎత్తుఉండాలి. అలాగే చాలా తెలివైన వ్యక్తి అయి ఉండాలి. జీవితంలో ఏదైనా సాధించి ఉండాలి’’అని రకుల్‌ చెప్పుకొచ్చారు.

తన కెరీర్‌ ఎలా ప్రారంభమైందో చెబుతూ ‘‘నేను చిన్నతనం నుంచే నటిని కావాలని కలలు కన్నాను. అందుకే చిన్న వయసులోనే చిత్రసీమలో అడుగుపెట్టాను. మొదట మోడలింగ్‌ చేశా. ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ చదువును కొనసాగించా. నాకు 18ఏళ్లు ఉన్నప్పుడు తొలిసినిమా అవకాశం వచ్చింది. నా నటనను గుర్తింపు లభించి తొలిసారి హీరోయిన్‌గా కన్నడ చిత్రంలో నటించాను’’అని రకుల్‌ ప్రీత్‌ చెప్పారు. 

మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని