Raj Kundra: పోర్న్‌ వీడియోల రేటు.. ధర తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే! - raj kundras whastapp chat show he was make deal with porn videos
close
Updated : 23/07/2021 22:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Raj Kundra: పోర్న్‌ వీడియోల రేటు.. ధర తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే!

న్యూదిల్లీ: అశ్లీల చిత్రాలను తెరకెక్కించడమే కాదు, వాటిని యాప్‌లలో అప్‌లోడ్‌ చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొని వ్యాపారవేత్త, సినీ నటి శిల్పశెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్టయిన సంగతి తెలిసిందే. రాజ్‌ కుంద్రాను విచారిస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన కాల్స్‌, వాట్సాప్‌ డేటా ఆధారంగా కీలక వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వాట్సాప్‌ చాట్‌ చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు. 121 పోర్న్‌ వీడియోలకు సంబంధించిన అతి పెద్ద డీల్‌ను రాజ్‌కుంద్రా చేశారని శనివారం పోలీసులు కోర్టుకు వెల్లడించారు. ఆ మొత్తం వీడియోల విక్రయానికి గానూ 1.2 మిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.9కోట్లు) ఒప్పందం చేసుకున్నారట.

‘‘121 పోర్న్‌ వీడియోలకు 1.2 మిలియన్‌ డాలర్లు చెల్లించాలని రాజ్‌కుంద్రా చేసిన వాట్సాప్‌ చాట్‌ను గుర్తించాం. ఆ డీల్‌ అంతర్జాతీయ స్థాయిలో ఉంది. పోర్న్‌ వీడియోలను విక్రయించగా వస్తున్న డబ్బుతో ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ చేసినట్లు మాకు అనుమానాలు ఉన్నాయి. ఇందుకు గానూ రాజ్‌కుంద్రా యస్‌ బ్యాంకు ఖాతా నుంచి యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఆఫ్రికా ఖాతాకు నగదు లావాదేవీలపై సమగ్ర విచారణ చేయాలి’’ అని ముంబయి పోలీసులు తెలిపారు.

మంగళవారం అరెస్టయిన రాజ్‌కుంద్రా ఈరోజు తన నివాసానికి వెళ్లారు. ఆయనతో పాటు పోలీసులు కూడా ఇంటికి వెళ్లి సోదాలు చేశారు. శిల్పాశెట్టి ఇంట్లోను ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసుల సోదాలు కొనసాగుతున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా శిల్పాశెట్టిని కూడా పోలీసులు విచారించనున్నారు. అరెస్టయిన నాటి నుంచి రాజ్‌కుంద్రాకు సంబంధించిన ఆఫీస్‌, ఇళ్ల నుంచి భారీగా అడల్ట్‌ కంటెంట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని