close
Published : 19/04/2021 14:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ఒరేయ్‌ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..

ఇంటర్నెట్‌ డెస్క్: సిద్ధార్థ్‌, జీవీ ప్రకాశ్‌ కుమార్‌ కలిసి నటిస్తోన్న చిత్రం ‘ఒరేయ్‌ బామ్మర్ది’. ‘బిచ్చగాడు’ ఫేం శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కశ్మీర పరదేశి, లిజోమోల్‌ జోస్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ‘ఆహా  ఎవరిది’ అంటూ సాగే వీడియో సాంగ్‌ విడుదలైంది. వెన్నెలకంటి కలం నుంచి జాలువారిన ఈ పాటని ఆనంద్ అరవిందక్షన్, యామిని ఘంటసాల ఆలపించారు. ఇందులో ట్రాఫిక్‌ పోలీసు అధికారిగా సిద్ధార్థ్‌, ఎలాంటి రూల్స్‌ పాటించకుండా.. బైక్‌ రేసులంటూ తిరిగే వ్యక్తిగా జీవీ ప్రకాశ్‌ కుమార్‌ కనిపిస్తున్నారు. యాక్షన్‌ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని రమేశ్‌ పి.పిళ్లై నిర్మిస్తున్నారు. శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్‌ పతాకంపై ఎ.ఎన్‌.బాలాజీ ఏప్రిల్‌ 30న తెలుగులో  విడుదల చేయనున్నారు. చిత్రానికి సిద్దూ కుమార్‌ సంగీత స్వరాలు అందిస్తుండగా, ఛాయాగ్రహకుడిగా ప్రసన్న కుమార్‌ పనిచేస్తున్నారు.   


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని