close
Published : 21/04/2021 01:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘వకీల్‌సాబ్‌’పై జస్టిస్‌ గోపాలగౌడ ప్రశంసలు

ఇంటర్నెట్‌డెస్క్‌: పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌సాబ్‌’. ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. కాగా, ఇటీవల ఈ సినిమాను చూసిన సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి  జస్టిస్‌ వి.గోపాలగౌడ ప్రశంసల వర్షం కురిపించారు.

‘‘మధ్యతరగతి మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలపై న్యాయ పోరాట చిత్రంగా ‘వకీల్‌సాబ్‌’ నిలిచింది. మహిళల హక్కుల కోసం పోరాటం చేసే యోధుడిగా పవన్‌కల్యాణ్‌ నటన అద్భుతం. ఇలాంటి సినిమాలు మాస్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరోలు చేయరు. కానీ, పవన్‌కల్యాణ్‌ సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా ప్రతి ఒక్కరి స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం మదనపడే వ్యక్తి. ముఖ్యంగా మహిళలకు, రైతులకు, ఆదివాసీలకు, దళితులకు జరిగిన అన్యాయాలపై తిరుగుబాటు చేసిన వ్యక్తి. అందుకే వకీల్‌సాబ్‌ పాత్రలో ఆయన జీవించారు. వకీల్‌సాబ్‌ ఒక అత్యుత్తమ చిత్రంగా చిరస్థాయిగా నిలిచిపోతుంది’’ అని కితాబిచ్చారు. తమన్‌ సంగీతం అందించిన ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించారు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని