పరుగు పందెంలా చూడలేదు - john abraham says he has never been a part of the rat race
close
Published : 14/06/2021 09:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పరుగు పందెంలా చూడలేదు

ముంబయి: చిత్రసీమలో తనకంటూ ఓ నిర్దుష్టమైన స్థానం ఉంది అంటున్నారు జాన్‌ అబ్రహాం. సినిమాల్ని తానెప్పుడూ పరుగు పందెంలా చూడలేదని, అందుకే నటుడిగా నాకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పడిందని చెప్పుకొచ్చారు. యాక్షన్‌ చిత్రాలకి పెట్టింది పేరైన జాన్‌ బాలీవుడ్‌లో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఇటీవల అన్ని రకాల సినిమాలతోనూ మురిపిస్తున్నారు. ప్రస్తుతం ‘ఎటాక్‌’, ‘సత్యమేవ జయతే2’, ‘ఏక్‌ విలన్‌ 2’ చిత్రాలతోపాటు షారుఖ్‌ ఖాన్‌తో కలిసి ‘పఠాన్‌’ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవల ‘ముంబై సాగా’లో ఇమ్రాన్‌ హష్మితో కలిసి నటించారు. ఓ ఇంటర్వ్యూలో జాన్‌ అబ్రహాం మాట్లాడుతూ నటులకి స్థిరమైన ప్రేక్షకులు ఉండటం ఓ గొప్ప విషయం అన్నారు. ‘‘సంజయ్‌దత్‌, సల్మాన్‌ఖాన్‌లాంటి కథానాయకులకి స్థిర ప్రేక్షకులు ఉండటంతో వాళ్లేం చేసినా చూస్తారు. అలా ఎంతో కొంత స్థిరమైన ప్రేక్షకగణం నాకూ ఉంద’’ని చెప్పుకొచ్చారు జాన్‌.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని