close
Published : 02/03/2021 01:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జయసుధను ఇలా చూశారా..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అలనాడు హీరోయిన్‌గా కుర్రకారు మనసులు దోచుకున్న జయసుధ.. ఇప్పుడు అమ్మగా, పెద్దమ్మగా, అమ్మమ్మగా.. నానమ్మగా మారి సహజనటిగా తెరపై అలరిస్తూనే ఉన్నారు. అయితే.. ఇటీవల ఆమె సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. శతమానం భవతి, శ్రీనివాసకళ్యాణం, మహర్షి, రూలర్‌ చిత్రాల తర్వాత ఆమె తెరకు దూరంగా ఉంటున్నారు. ఇదంతా సరే.. ఇప్పుడీ చర్చ ఎందుకంటారా.? చర్చంతా సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఆమె కొత్త లుక్‌ గురించే. ఉన్నట్లుండి ఆమె వయసు ఒక్కసారిగా పెరిగిపోయినట్లు అనిపిస్తోంది. మొన్నటి వరకూ మనకు కనిపించిన జయసుధకు ఇది పూర్తి భిన్నమై లుక్‌లో ఆమె ఉంది. నెరిసిన జుట్టుతో ఉన్న ఆమె లుక్‌ ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అయింది. దీంతో ఆమె లుక్‌ను చూసిన అభిమానులు కొంతమంది ఆందోళనకు గురయ్యారు కూడా. 

‘‘జానకి కలగనలేదు..’ అనే కొత్త సీరియల్‌ త్వరలో మీముందుకు రాబోతోంది’ అని చెబుతూ ఆమె ఒక వీడియో పోస్టు చేశారు. ‘‘రాజ్‌కుమార్‌’ సినిమాలోని ‘జానకి కలగనలేదు.. రాముడి సతి కాగలనని’ అనే పాటకు శోభన్‌బాబుగారు నేను కలిసి కనిపించాం.  ఇళయరాజాగారు సంగీతం అందించిన ఆ పాట అప్పట్లో అందర్నీ బాగా అలరించింది. ఇప్పటికీ ఎక్కడ పాటల పోటీలు జరిగినా.. ఆ పాట ఎవరో ఒకరు పాడుతున్నారు’ అని ఆమె అన్నారు. అయితే. ఆమె కొత్త లుక్‌ వెనకాల ఉన్న కారణమేంటో ఇంకా తెలియరాలేదు.ఇవీ చదవండి


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని