Bollywood: వీళ్లొచ్చేది... వచ్చే ఏడాది! - here bollywood movies got relase date
close
Published : 28/09/2021 10:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bollywood: వీళ్లొచ్చేది... వచ్చే ఏడాది!

బాలీవుడ్‌ దూకుడు పెంచింది. థియేటర్లు తెరచుకోనుండటంతో హిందీ చిత్రసీమలో సందడి వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటివరకూ ఒక్కసినిమా విడుదల తేదీ ఖరారైతే చాలు అనుకుంటే ఇప్పుడు వరసగా బెర్తుల్ని ఖరారు చేసుకుంటున్నాయి. రానున్న మూడు నెలల్లోనే కాదు వచ్చే ఏడాది కోసం కూడా విడుదల తేదీల్ని ప్రకటిస్తూ బాలీవుడ్‌ జోరు పెంచింది.

బాలీవుడ్‌ యువ  కథానాయకుడు టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘గణపథ్‌’. ఈ సినిమాని 2022 డిసెంబరు 23న  ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వికాస్‌ భల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కృతి సనన్‌ కథానాయిక.   

రాకెట్రి..ఏప్రిల్‌ 1న: మాధవన్‌ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాకెట్రి’: ది నంబి ఎఫెక్ట్‌’ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1న విడుదల కానుంది. ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ జీవిత కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రను మాధవన్‌ పోషిస్తున్నారు. ఇందులో షారుక్‌ ఖాన్‌ అతిథి పాత్రలో కనిపించనున్నారు. హిందీతో పాటు తెలుగు తమిళ కన్నడ మలయాళ ఇంగ్లిష్‌ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. 

ద్వితీయార్ధంలో షారుక్‌..సల్మాన్‌: సల్మాన్‌ఖాన్‌ హీరోగా ‘టైగర్‌ 3’ తెరకెక్కుతోంది. ఇందులో శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. షారుక్‌ నటిస్తున్న యాక్షన్‌ చిత్రం ‘పఠాన్‌’. ఈ రెండింటినీ వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు  తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని