close
Published : 25/01/2021 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
వరుణ్‌ పెళ్లిలో సిబ్బంది కెమెరాలకు స్టిక్కర్లు!

​​​​​​

ముంబయి: సినీ ప్రముఖుల ఇళ్లలో శుభకార్యాలు ఎంత అట్టహాసంగా జరుగుతాయో.. నిబంధనలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. చాలా మంది సినీ ప్రముఖులు తమ వ్యక్తిగత విషయాలు అందరితో పంచుకోవాలని కోరుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం తమ వ్యక్తిగత జీవితానికి గోప్యత కోరుకుంటూ ఉంటారు. ఆదివారం బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ధావన్‌, తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో ఫొటోలు తీయకుండా ఆ వివాహ ఏర్పాట్లను చూసుకునే సిబ్బంది సెల్‌ఫోన్లకు స్టిక్కర్లు వేశారట. స్టిక్కర్లు తీసిన వెంటనే భద్రత సిబ్బందికి సమాచారం వెళ్లేలా ఏర్పాట్లు చేశారట. ఈ వార్త కాస్త సోషల్‌మీడియాకి చిక్కడంతో కొంతమంది నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్‌ తన సినిమాల విషయంలో కూడా ఇలాగే వ్యవహరిస్తారా.? అని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది మాత్రం ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని, దాన్ని గోప్యంగా ఉంచుకోవాలని కోరుకోవడంలో తప్పులేదని అభిప్రాయపడుతున్నారు.  

వేదికపై కళ్లు తిరిగి పడిపోయిన డైరెక్టర్‌


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని