గూగుల్‌లో వీటిని వెతకడం ప్రమాదం!
గూగుల్ సెర్చ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
దేనికైనా గూగుల్ సెర్చే! వెబ్సైట్లు ఓపెన్ చేస్తాం. సినిమాలు వెతికి చూస్తాం. అడ్రస్‌ల కోసం వేటాడతాం. అంతెందుకు.. ఏ చిన్న సందేహం వచ్చినా గూగుల్ సెర్చ్ బాక్స్‌పై వాలిపోతాం. పలు కీవర్డులతో వెతికేస్తాం. ఇలా రోజువారీ అవసరాల్లో గూగుల్ సెర్చ్ భాగమైపోయింది. కానీ, గూగుల్ అడ్డాలో దొరికేవన్నీ నిజాలే అనుకోకూడదు. కొన్ని స్కామర్లు పన్నే ఉచ్చులు కూడా ఉంటాయి. నకిలీ సెర్చ్ ఫలితాలు వస్తాయి. ‘ఎస్ఈఓ’లు మోసుకొచ్చే మార్కెటింగ్ లింక్‌లూ దర్శనమిస్తాయి. అందుకే గూగుల్‌లో వెతుకులాట ఏం వెతకకూడదో తెలుసుకోవడం అనివార్యం. ఇవిగోండి కొన్ని వీటిని సెర్చ్ చేయకపోవడమే మంచిది!
కాంటాక్ట్‌లు వెతికితే..
క్రెడిట్ కార్డు వాడుతున్న క్రమంలోనో.. ఏ డీటీహెచ్ కనెక్షన్ గురించో.. వాడుతున్న పోస్ట్ పెయిడ్ నెట్వర్క్ బిల్లు నిమిత్తమో.. కస్టమర్ కేర్ నెంబర్ని గూగుల్ సెర్చ్‌లో వెతకడం మానండి. స్కామర్లు నకిలీ ఫోన్ నంబర్లు, వెబ్సైట్లతో మిమ్మల్ని మాయ చేయొచ్చు. అందుకే ఆయా అధికారిక యాప్‌లు, వెబ్సైట్ల్లోకి వెళ్లి కాంటాక్ట్‌లను చూడండి. కస్టమర్ కేర్ ఛాట్ విండోలను వాడుకుని కూడా సంభాషించొచ్చు.
యూఆర్ఎల్స్తోనూ చిక్కే..
నిత్యం ఆన్లైన్ బ్యాంకింగ్ వ్యవహారాల్ని చేసే వెబ్ యూఆర్ఎల్ లింక్‌ని కూడా గూగుల్‌లో వెతికి లాగిన్ అయ్యేవారు ఎంతో మంది ఉన్నారు. నెటిజన్లు ఈ అలవాటుని వెంటనే మానుకోవాలి. ఎందుకంటే ఒక్క అక్షరం తేడాతో ఫేక్ యూఆర్ఎల్ లింక్‌లను స్కామర్లు క్రియేట్ చేస్తారు. సరిగా చూసుకోకుండా లాగిన్ వివరాల్ని ఎంటర్ చేస్తే చాలు. మీ వ్యక్తిగత వివరాలు హ్యాకర్ల చేతికి వెళ్లిపోతాయి. అందుకే అధికారిక యూఆర్ఎల్ లింక్‌ని టైప్ చేసి మాత్రమే లాగిన్ అవ్వాలి.
యాప్‌లు.. సాఫ్ట్వేర్లు వద్దు
ఫోన్, పీసీల్లో ఏవేవో యాప్‌లు, సాఫ్ట్వేర్ అప్లికేషన్లు వాడుతుంటాం. కొన్ని సార్లు అవసరానికి తగిన వాటిని వెతికి, ఇన్స్టాల్ చేసే ప్రయత్నం చేస్తుంటాం. సెర్చ్ ద్వారా వెతికి యాప్‌లు, ఇతర సెట్అప్లను ఇన్స్టాల్ చేయడం సురక్షితం కాదు. ఎందుకంటే.. అనధికారికి సైట్ల నుంచి డౌన్లోడ్ చేసే వాటిల్లో మాలిషియస్ సాఫ్ట్వేర్లు ఉండొచ్చు. ఎప్పుడైనా మీకు అవసరమైన అప్లికేషన్స్‌ని అధికారిక యాప్ స్టోర్ల నుంచే డౌన్లోడ్ చేసుకోండి.
మందుల్ని వెతకడం మానండి
చేతిలో ఫోన్ ఉందనో.. ఇంట్లో సిస్టమ్ ఉందనో మందుల గురించి వెతకడం.. నలతకి కారణాల్ని చూడడం చేయొద్దు. అలాగే, రోగ లక్షణాలతో మందుల్ని వెతికి ఆన్లైన్లో ఆర్డర్ చేయడం ఏ మాత్రం సురక్షితం కాదు. వైద్యుడిని సంప్రదిస్తేనే సరైన చికిత్స దొరుకుతుంది. గూగుల్ భాండాగారంలో ఉండేది సమాచారం మాత్రమే.. పరిష్కారం కాదని గ్రహించాలి. బరువు తగ్గడానికి చిట్కాలు వెతకడం.. వాటిని ఫాలో అవ్వడం చేయకండి.
ఆర్థిక వివరాల సంగతేంటి?
ఆరోగ్యం ఎలాగైతే ఒక్కొక్కరిది ఒక్కో తీరుగా ఉంటుందో.. ఆర్థిక పరమైన అంశాలుగా వేరు వేరుగా ఉంటాయి. గూగుల్ సెర్చ్‌లో పర్సనల్ ఫైనాన్స్, స్టాక్ మార్కెట్ అంశాల్ని వెతికి, దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవద్దు. పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయొద్దు. మీదైన విశ్లేషణ.. తెలివితేటలతోనే నిర్ణయాలు తీసుకోవాలి.
ప్రభుత్వరంగ సేవలు కూడా..
బ్యాంకింగ్‌లో మాదిరిగానే ప్రభుత్వరంగ వెబ్ యూఆర్ఎల్ లింక్‌లను గూగుల్ సెర్చ్ చేసి ఓపెన్ చేయడం మానుకోవాలి. ఉదాహరణకు మున్సిపల్ టాక్స్, రిజిస్ట్రేషన్లు, ఇతర ముఖ్యమైన రంగాలకు సంబంధించిన వెబ్ లింక్‌లను సెర్చ్ రిజిల్ట్ల నుంచి యాక్సెస్ చేయడం మంచిది కాదు. స్కామర్ల నకిలీలు సిద్ధంగా ఉంటాయి. వాటిల్లో లాగిన్ అయితే ప్రమాదం.
కూపన్లు వేట వద్దు
ఆన్లైన్ షాపింగ్‌ల్లో డిస్కౌంట్ కూపన్ల వాడడం తెలిసిందే. అధికారిక వెబ్సైటుల్లో అందుబాటులో ఉన్నవాటితో సమస్య లేదు. కానీ, నెట్టింట్లో నకలీ కూపన్లే ప్రమాదం. సెర్చ్‌లో కూపన్లు వెతికి వాటిని ప్రయత్నించడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే.. ఆకట్టుకునే డీల్స్‌తో కూడిన పేజీలను క్రియేట్ చేసి హ్యాకర్లు ఆన్లైన్ బ్యాంకింగ్ వివరాల్ని దొంగిలించే ప్రయత్నిం చేస్తున్నారు.
మరిన్ని
కొత్త సినిమాలు
- రూ. 6.5 కోట్ల సెట్లో.. ‘శ్యామ్ సింగరాయ్’
-
‘మహాసముద్రం’ సిద్ధార్థ్ ఫస్ట్‌లుక్
-
ఆకట్టుకునేలా ‘సెహరి’ టీజర్
- వీరభద్రం దర్శకత్వంలో ఆది
-
‘అంటే సుందరానికీ!’.. నాకెంతో స్పెషల్: నజ్రియా
గుసగుసలు
- Sukumar: లెక్కల మాస్టారి ‘లెక్క’ ఎవరితో?
- ఆ బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ కొత్త మూవీ?
- ‘ఆర్సి 15’లో జర్నలిస్టుగా రష్మిక?
-
Pushpa: యాక్షన్ సీన్ల కోసం అంత ఖర్చా?
- Drushyam2: తెలుగు మూవీ కూడా ఓటీటీలో?
రివ్యూ
-
99Songs Review: రివ్యూ: 99 సాంగ్స్
-
Rgv deyyam review: రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: సుల్తాన్
ఇంటర్వ్యూ
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
-
Vakeelsaab: ఆరోజు ఎప్పటికీ మర్చిపోను: నివేదా
-
Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
కొత్త పాట గురూ
-
‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
-
మనసా..వినవా.. అంటోన్న ‘101 జిల్లాల అందగాడు’
-
ఆకాశవాణి: తొలిగీతం విన్నారా..!
- అజయ్ భూపతి దర్శకత్వంలో అఖిల్?
-
‘ఒరేయ్ బామ్మర్ది’ నుంచి.. ఆహా ఎవరిది..