Prabhas: ‘సలార్‌’ పోరు
close
Updated : 16/09/2021 12:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Prabhas: ‘సలార్‌’ పోరు

కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్‌... అంటూ పోరాటాలు చేస్తుంటాడు ప్రభాస్‌. కానీ తెరపైన ఆయన చేసే యాక్షన్‌ ఘట్టాల్ని చూశాక ప్రేక్షకులకు అన్నీ నమ్మేయాలి అనిపిస్తుంది. అంతగా వాటిపై ప్రభావం చూపిస్తుంటారు ప్రభాస్‌. ‘సలార్‌’లోనూ ఆయన యాక్షన్‌ ప్రత్యేకంగానే ఉండనుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభాస్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. శ్రుతిహాసన్‌ నాయిక. హోంబలే ఫిలిమ్స్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్‌ నిర్మిస్తున్నారు. విరామ సమయంలో వచ్చే ఈ సినిమాలోని పోరాట ఘట్టాన్ని, కొన్ని కీలక సన్నివేశాల్ని ఇటీవల రామోజీ ఫిల్మ్‌సిటీలో తెరకెక్కించారు. ఈ ఎపిసోడ్‌లో ప్రభాస్‌ కనిపించే తీరు, భారీ హంగులతో సాగే పోరాట ఘట్టాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్టు సమాచారం.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని