ప్రేక్షకులు ఆదరిస్తున్నారు
close
Published : 01/08/2021 05:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రేక్షకులు ఆదరిస్తున్నారు

‘‘రెండో దశ కరోనా ఉద్ధృతి తర్వాత ‘తిమ్మరుసు’ థియేటర్లలో విడుదలవుతుంటే.. ప్రేక్షకులు వస్తారా, లేదా? అని లోపల చిన్న టెన్షన్‌ ఉండేది. కానీ, సినీప్రియులు మా సినిమాని ఆదరించి నా పై ఒత్తిడి తగ్గించారు. అందుకే అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా’’ అన్నారు సత్యదేవ్‌. ఆయన కథానాయకుడిగా శరణ్‌ కొప్పిశెట్టి తెరకెక్కించిన చిత్రం ‘తిమ్మరుసు’. మహేశ్‌ కోనేరు, సృజన్‌ యరబోలు నిర్మించారు. ప్రియాంక జవాల్కర్‌ కథానాయిక. ఇటీవలే విడుదలైంది. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో చిత్ర బృందం సక్సెస్‌మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా సత్యదేవ్‌ మాట్లాడుతూ ‘‘నా తొలి సక్సెస్‌ఫుల్‌ సినిమా సక్సెస్‌ మీట్‌ ఇది.

చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రమిచ్చిన నమ్మకంతో ఇంకా మంచి సినిమాలు చేయాలని బలంగా అనిపించింది. ఈ విజయంలో భాగమైన అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు.‘‘మా కష్టాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వారిచ్చిన నమ్మకంతో మరింత ఉత్సాహంగా ముందుకెళ్తాం’’ అన్నారు దర్శకుడు శరణ్‌ కొప్పిశెట్టి. ఈ కార్యక్రమంలో బ్రహ్మాజీ, మహేశ్‌ కోనేరు, శ్రీచరణ్‌ పాకాల, అంకిత్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని