యుద్ధంతో రాసిన ప్రేమకథ
close
Updated : 29/07/2021 04:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యుద్ధంతో రాసిన ప్రేమకథ

‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులకు మరింతగా చేరువయ్యారు దుల్కర్‌ సల్మాన్‌. ఆయన కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ సమర్పిస్తోంది. ఇందులో లెఫ్టినెంట్‌ రామ్‌ అనే పాత్రలో దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్నారు. బుధవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రత్యేకమైన వీడియోని విడుదల చేసింది. యుద్ధంతో రాసిన ప్రేమకథ అంటూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేసింది. దీన్నిబట్టి సరిహద్దుల్లో ఓ సైనికుడు, యుద్ధం నేపథ్యంలో సాగే ప్రేమకథ అని తెలుస్తోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని