రాజ రాజు వచ్చే...
close
Published : 29/07/2021 00:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాజ రాజు వచ్చే...

శ్రీవిష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘రాజ రాజ చోర’. మేఘ ఆకాష్‌ కథానాయిక. సునైన ముఖ్యభూమిక పోషిస్తున్నారు. హసిత్‌ గోలి దర్శకుడు. టి.జి.విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మాతలు. ఈ చిత్రంలోని ‘రాజ రాజు వచ్చే... లోకాలు మెచ్చే...’ అంటూ సాగే పాటని విడుదల చేసింది చిత్రబృందం. వివేక్‌సాగర్‌ స్వరపరిచిన ఈ గీతానికి దర్శకుడు హసిత్‌ గోలి సాహిత్యం అందించారు. మోహన భోగరాజు ఆలపించారు. ఈ పాటకి సామాజిక మాధ్యమాల్లో మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. ఇప్పటికీ విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ప్రత్యేకంగా ఆకర్షించాయని, చిత్రం కూడా తప్పకుండా అలరిస్తుందని సినీ వర్గాలు తెలిపాయి. తనికెళ్ల భరణి, గంగవ్వ, అజయ్‌ ఘోష్‌ తదితరులు నటిస్తున్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని