కళ్యాణ మండపం నవ్విస్తుంది
close
Updated : 29/07/2021 04:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కళ్యాణ మండపం నవ్విస్తుంది

కిరణ్‌ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణమండపం ఇ.ఎస్‌.టి.1975’. సాయికుమార్‌ ముఖ్య భూమిక పోషించారు. శ్రీధర్‌ గాదే దర్శకుడు. ప్రమోద్‌ - రాజు నిర్మాతలు. శంకర్‌ పిక్చర్స్‌ సంస్థ నుంచి ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్‌ని బుధవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం మాట్లాడుతూ ‘‘కుటుంబ సమేతంగా చూడదగిన ఈ చిత్రం థియేటర్లో తప్పకుండా వినోదం పంచుతుంది.

2 గంటల 40నిమిషాలు నవ్విస్తుంది. నేను థియేటర్లలో, టీవీల్లో చూసిన గొప్ప నటులు సాయికుమార్‌తో కలిసి నటించడం ఆనందాన్నిచ్చింది. నేను కథ చెప్పగానే నన్ను నమ్మిన నిర్మాతలు ప్రమోద్‌, రాజులకి ఎప్పటికీ రుణపడి ఉంటా. వారి ప్రోత్సాహం లేకపోతే ఈ సినిమా ఇలా వచ్చేది కాదు. దర్శకుడు శ్రీధర్‌ ఈ సినిమాని ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దార’’న్నారు. సాయికుమార్‌ మాట్లాడుతూ ‘‘నా యాభై ఏళ్ల సినీ జీవితంలో ఇప్పటివరకు పోషించిన ఎన్నో పాత్రలు నా తొలి ఇన్నింగ్స్‌కి వైభవాన్నితీసుకొచ్చాయి. అందులో ‘పోలీస్‌స్టోరి’, ‘ప్రస్థానం’ వంటి చిత్రాలు నాకు ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చాయి. నా సినీ జీవితాన్ని మలుపుతిప్పాయి.

అలా నా రెండో ఇన్నింగ్స్‌కి అద్భుతమైన గుర్తింపుని తీసుకొచ్చే సినిమాగా ‘ఎస్‌.ఆర్‌.కళ్యాణమండపం’ నిలుస్తుంది. ప్రేక్షకులు థియేటర్లలోనే చూసి ప్రోత్సహించాలని ప్రార్థిస్తున్నా’’ అన్నారు. ఈ కార్యక్రమంలో కథానాయకుడు శ్రీసింహా, దర్శకులు బి.కిషోర్‌, కౌశిక్‌, నిర్మాత ముత్యాల రాందాస్‌, దీప్తి  తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని