భీమ్లానాయక్‌గా పవన్‌కల్యాణ్‌
close
Published : 27/07/2021 02:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భీమ్లానాయక్‌గా పవన్‌కల్యాణ్‌

కొన్ని నెలల విరామం తర్వాత సినిమా సెట్లోకి అడుగుపెట్టారు పవన్‌కల్యాణ్‌. పోలీస్‌ డ్రెస్‌ ధరించి కెమెరా ముందుకొచ్చారాయన. మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ రీమేక్‌ కోసమే ఇదంతా. పవన్‌కల్యాణ్‌, రానా కథానాయకులుగా సాగర్‌ చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇదివరకే ప్రారంభమైన ఈ చిత్రం రెండో దశ కరోనాతో ఆగిపోయింది. కొన్ని నెలల విరామం తర్వాత సోమవారం నుంచి చిత్రీకరణని పునః ప్రారంభించారు. హైదరాబాద్‌లో తీర్చిదిద్దిన ప్రత్యేకమైన సెట్లో పవన్‌కల్యాణ్‌తోపాటు ఇతర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పవన్‌కల్యాణ్‌ భీమ్లానాయక్‌ అనే పోలీస్‌ అధికారిగా కనిపిస్తారని, అన్ని
జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణని ప్రారంభించామని తెలిపింది చిత్రబృందం.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని