టబు పాత్రలో మనీషా!
close
Published : 19/06/2021 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టబు పాత్రలో మనీషా!

‘అల వైకుంఠపురంలో..’ హిందీ రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో కార్తీక్‌ ఆర్యన్‌ కథానాయకుడిగా నటించనున్నాడు. కార్తిక్‌ సరసన కృతి సనన్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. తెలుగులో టబు పోషించిన పాత్రను హిందీలో ఎవరు చేస్తారనే దాని విషయంలో చిత్రబృందం తర్జన భర్జనలు పడిందట. ఎట్టకేలకు మనీషా కోయిరాలను ఎంపిక చేసినట్టు సమాచారం. హిందీలోనూ టబు చేస్తే బాగుంటుదనుకున్నా కార్తిక్‌, టబు కలిసి‘భూల్‌ భూలయ్యా 2’ చిత్రంలో నటించారు. అందుకే మనీషా వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ‘‘కార్తీక్‌ తల్లి పాత్రలో మనీషా నటించనున్నారు. అందుకు సంబంధించిన చర్చలూ పూర్తయ్యాయి. ఈ ఏడాదిలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది’’అని చిత్రవర్గాలు చెప్పినట్టు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని