close
Published : 21/04/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘విక్రమ్‌’లో సేతుపతి?

‘ఉప్పెన’లో తనదైన నటనతో మెప్పించిన విజయ్‌సేతుపతి... దక్షిణాదిలో ఎంత బిజీ నటుడో చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల వరకూ ఆయన డేట్లు దొరకడం కష్టమయ్యే పరిస్థితి. కమల్‌హాసన్‌ చేస్తున్న ‘విక్రమ్‌’లో ప్రతినాయకుడిగా సేతుపతి నటించే అవకాశాలున్నాయని అంటోంది కోలీవుడ్‌. ఈ చిత్ర దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ దీనిపై సేతుపతితో మాట్లాడాడు. డేట్లు సర్దుబాటు కాకపోవడంతో సేతుపతి ఆలోచనలో పడ్డారట. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘‘ఇంత పెద్ద ప్రాజెక్టు.. పైగా కమల్‌  హాసన్‌ చిత్రం.. అవకాశం రావడమే గొప్ప. అలాంటి దాన్ని వదలుకోకూడదనుకుంటున్నా. డేట్లు సర్దుబాటు కోసం ప్రయత్నిస్తున్నా’’ అని చెప్పుకొచ్చాడు. సేతుపతి ఇప్పటికే లోకేష్‌కనగరాజ్‌ తెరకెక్కించిన ‘మాస్టర్‌’లో ప్రతినాయకుడిగా మెప్పించాడు. మరోసారి వీరిద్దరు కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్‌ అంటోంది.


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని