గురువారం, ఆగస్టు 06, 2020
home
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
జాతీయ- అంతర్జాతీయ
క్రైమ్
పాలిటిక్స్
బిజినెస్‌
క్రీడలు
సినిమా

ఫీచర్ పేజీలు

ఫొటోలు
వీడియోలు
ఎన్ఆర్ఐ

ఇంకా..

E Paper
Archives
Terms & Conditions
Privacy Policy
FacebookTwitter

తాజా వార్తలు

బాహుబలి: ది బిగినింగ్‌కు ఐదేళ్లు!

బాహుబలి.. తెలుగు వారి ప్రతిభను, ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా. దర్శక ధీరుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో బాహుబలిగా ప్రభాస్‌ నటన యావత్‌ సినీ అభిమానుల్ని ఆకట్టుకుంది. శివగామిగా రమ్యకృష్ణ అభినయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భళ్లాలదేవగా రానా, దేవసేనగా అనుష్క, అవంతికగా తమన్నా, కట్టప్పగా సత్యరాజ్‌ ముఖ్య భూమిక పోషించారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం ఈ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. వీఎఫ్ఎక్స్‌, మాహిష్మతి రాజ్యం సెట్‌ సినిమాకి హైలెట్‌గా నిలిచాయి. రెండు భాగాలుగా వచ్చిన ఈ సినిమా తొలి భాగం ‘బాహుబలి: ది బిగినింగ్‌’ 2015 జులై 10న విడుదలైంది. అంటే నేటికి ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘‘వెండితెరపై సంచలన విజయం అందుకున్న ‘బాహుబలి’ చిత్రానికి నేటితో ఐదేళ్లు’’అని బాహుబలి టీమ్‌ ట్వీట్‌ చేసింది. ఈ సినిమాను ఇంత పెద్ద హిట్‌ చేసినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది. అలాగే ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. రెండు నిమిషాల ఈ వీడియోలో ‘బాహుబలి: ది బిగినింగ్‌’ చిత్రం మొత్తాన్ని చూపించారు. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలను వీడియోలో పెట్టారు. 

మరోవైపు హిందీలో బాహుబలిని విడుదల చేసిన ధర్మా ప్రొడక్షన్స్‌ సైతం బాహుబలి ఐదేళ్ల వేడుకను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ‘‘అద్భుతమైన ఈ సినిమా.. భారతీయ సినిమా ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసింది’’అంటూ ట్వీట్‌ చేయడంతోపాటు ప్రత్యేక వీడియోను జత చేసింది.

 

 

 


మరిన్ని

జిల్లాలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని