అభిమానికి ధైర్యం చెప్పిన బాలయ్య - famous actor balakrishna talking to a fan
close
Published : 14/06/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అభిమానికి ధైర్యం చెప్పిన బాలయ్య

తిరుపతి: ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు అభిమానులపై ఉన్న ఆప్యాయతను మరోమారు చాటుకున్నారు. కొద్ది రోజుల క్రితం చెట్టుమీద నుంచి కిందపడటంతో నడుముకు తీవ్ర గాయమై మంచానికే పరిమితమైన తన అభిమానికి నేరుగా ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు.

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గొల్లపల్లికి చెందిన మురుగేష్‌(23)తో ఆప్యాయంగా మాట్లాడిన బాలయ్య.. అభిమాని బాగోగులు, ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాను మంచానికే పరిమితమవడంతో తల్లి కూలి పనులకు వెళ్లాల్సి వస్తుందంటూ అభిమాని బాలయ్యతో తన బాధ పంచుకోగా.. బాలకృష్ణ ఆదేశాల మేరకు తక్షణమే రూ.40వేల ఆర్థిక సాయాన్ని మురుగేష్‌కు అందించారు.

ఫోన్లో మాట్లాడుతూ.. గతంలో తనకు జరిగిన ప్రమాదాలను బాలకృష్ణ అభిమానితో పంచుకున్నారు. ఆదిత్య 369 సినిమా షూటింగ్‌ సమయంలో ప్రమాదం జరగడంతో నడుముకు తీవ్ర గాయమైందని, ధైర్యంగా ఉండటంతో తిరిగి కోలుకున్నానని మురుగేష్‌కు ధైర్యం చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని