TheFamilyMan-2: ఎక్కడా తగ్గేదేలే - family man is fourth on imdb list of most popular shows in the world manoj bajpayee celebrates
close
Published : 22/06/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TheFamilyMan-2: ఎక్కడా తగ్గేదేలే

మోస్ట్‌ పాపులర్‌ షోస్‌ ఇన్‌ ది వరల్డ్‌ లిస్ట్‌లో చోటు

ముంబయి: ‘ది ఫ్యామిలీ మేన్‌-2’ సిరీస్‌ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. వరల్డ్స్‌ మోస్ట్‌ పాపులర్‌ షో జాబితాలో స్థానం దక్కించుకుంది. తమిళ ఈలం పోరాట నేపథ్యంలో తెరకెక్కిన ఈ స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎన్నో వివాదాలు ఎదురైనప్పటికీ విశేషమైన ప్రేక్షకాదరణతో సక్సెస్‌ సొంతం చేసుకుంది. కాగా, తాజాగా ఐఎండీబీ వాళ్లు విడుదల చేసిన ‘మోస్ట్ పాపులర్‌ షోస్‌ ఇన్‌ ది వరల్డ్‌’ జాబితాలో ‘ది ఫ్యామిలీ మేన్‌-2’ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. దీనిపై నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్ ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు హాలీవుడ్‌కు చెందిన ‘లోకి’, ‘స్వీట్‌ టూత్‌’, ‘మేర్‌ ఆఫ్‌ ఈస్ట్‌ టౌన్‌’ మొదటి మూడు స్థానాలను సొంతం చేసుకున్నాయి. యూజర్‌ ఓట్లను ఆధారంగా చేసుకుని ప్రతియేటా ఐఎండీబీ వాళ్లు ఈ లిస్ట్‌ సిద్ధం చేస్తారు. ‘ది ఫ్యామిలీ మేన్‌’ కాకుండా ఏ ఇతర ఇండియన్‌ సిరీస్‌ ఈ జాబితాలో చోటు దక్కించుకోలేదు.

మనోజ్‌ బాజ్‌పాయ్‌ ప్రధాన పాత్రలో బాలీవుడ్‌ దర్శకులు రాజ్‌ అండ్‌ డీకే ‘ది ఫ్యామిలీ మేన్‌’ సిరీస్‌ను తెరకెక్కించారు. మొదటి సీజన్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ కావడంతో దానికి సీక్వెల్‌గా ‘ది ఫ్యామిలీ మేన్‌-2’ రూపొందించి జూన్‌ నెలలో అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇందులో అగ్రకథానాయిక సమంత  ‘రాజీ’ పాత్రలో మెప్పించారు. అయితే ఈ సిరీస్‌.. తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని.. కాబట్టి ఈ సిరీస్‌ను నిలిపివేయాలని పలువురు రాజకీయ, సినీ సెలబ్రిటీలు విమర్శలు చేసిన విషయం విదితమే.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని