Extra Jabardasth వచ్చేవారం రెట్టింపు వినోదంతో సిద్ధం - extra jabardasth latest promo rashmi sudigali sudheer
close
Published : 27/07/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Extra Jabardasth వచ్చేవారం రెట్టింపు వినోదంతో సిద్ధం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈటీవీలో ప్రతి శుక్రవారం ప్రసారమ్యే కామెడీషో ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్‌’ వచ్చే వారం రెట్టింపు సందడి చేసేందుకు సిద్ధమైంది. ముందస్తుగా ఓ ప్రోమోను విడుదల చేశారు. జూలై 30న పూర్తి ఎపిసోడ్‌ ప్రసారం కానుంది. మరి ఆలస్యమెందుకు అప్పటివరకూ ఈ ప్రోమోపై ఓ లుక్కేయండి మరి. ఇంతకీ ఆ ప్రోమోలో ఏముందంటే..

తాను ఒక మధ్య తరగతి టీమ్‌ లీడర్‌నని.. జడ్జిలు నవ్వకుండా వెళ్లిపోతే మధ్య తరగతి టీమ్‌ లీడర్‌ ఎంత బాధపడతాడో తెలుసా? అని రాకింగ్‌ రాకేశ్‌ ప్రశ్నించగా.. మీ స్కిట్‌ చూసి మేమెంత బాధపడుతున్నామో నీకు తెలుసా? అని రోజా రివర్స్‌ పంచ్‌ వేయడంతో పాపం రాకేశ్‌ నాలుక్కరుచుకున్నాడు. బుల్లెట్‌ భాస్కర్‌ మరోసారి హీరోగా మారాడు. తన భార్యగా ఫహీమా షూటింగ్‌ సెట్లో రెచ్చిపోయి పర్ఫార్మెన్స్‌ చేసింది. పొడవుగా కనిపించాలని నరేశ్‌ తన టీమ్‌ లీడర్‌ కార్తిక్‌ భుజాలపై ఎక్కి.. బాడీగార్డుగా అవతారంలో ఓ అమ్మాయి ఇంటికి వెళతాడు. అక్కడ కార్తీక్‌ చేసే చిలిపి పనులకు నరేశ్‌కు పాపం చుక్కలు కనిపించాయి. ఆ తర్వాత గెటప్‌ శ్రీను చేసిన స్కిట్‌ చూస్తే మాత్రం ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వడం పక్కా. ఈ స్కిట్‌లో మరోసారి ఫహీమా ఎంట్రీ ఇచ్చింది. ఫహీమాను పెళ్లి చూపులు చూసుకునేందుకు వచ్చిన సుధీర్‌ రావడం.. తర్వాత రామ్‌ప్రసాద్‌, గెటప్‌ శ్రీను పంచుల వర్షం కురిపించారు. ఇలా ప్రోమో మొత్తం నవ్వులు పూయించేలా ఉంది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని