Rolls Royce Case హైకోర్టులో హీరో విజయ్‌కి ఊరట - court relief for tamil actor vijay
close
Published : 28/07/2021 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rolls Royce Case హైకోర్టులో హీరో విజయ్‌కి ఊరట

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన రోల్స్‌రోయ్స్‌ కారుపై పన్ను మినహాయింపు కేసు విషయంలో తమిళ నటుడు విజయ్‌కి ఊరట లభించింది. గతంలో తాను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఖరీదైన కారుకు పన్ను మినహాయించాలంటూ విజయ్‌ అభ్యర్థించాడు. ఒక సెలబ్రెటీ అయ్యుండి పన్ను మినహాయింపు అడగడంతో ఆగ్రహించిన కోర్టు విజయ్‌కి ఇటీవల మొట్టికాయలు వేయడంతో పాటు రూ.లక్ష జరిమానా విధించిన విషయం తెలిసిందే. దీంతో విజయ్‌పై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా మరోసారి ఆ కేసును పరిశీలించిన మద్రాసు హైకోర్టు విజయ్‌కి ఊరట కల్పించింది. గతంలో విధించిన జరిమానా కట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే.. పూర్తి పన్ను కట్టాల్సిందేనని కోర్టు మరోసారి స్పష్టం చేసింది.

గతంలో ఏం జరిగిందంటే.. తమిళ హీరో దాదాపు రూ. 7.95 కోట్ల విలువైన రోల్స్‌ రాయిస్‌ గోస్ట్‌ కారు కొనుగోలు చేశాడు. ఇంగ్లాండ్‌ నుంచి దిగుమతి చేసుకున్న ఆ కారుకు పన్ను మినహాయింపు కోరుతూ విజయ్‌ హైకోర్టును ఆశ్రయించాడు. ఆ అభ్యర్థనను న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎం సుబ్రమణియన్‌ కొట్టివేశారు. రీల్‌ హీరోలు రియల్‌ హీరోలుగా నిలవాలని సూచించారు. పన్ను చెల్లించడం ప్రతి పౌరుడి విధి అన్నారు. దీంతో పాటు రెండు వారాల్లోగా ముఖ్యమంత్రి కొవిడ్‌ సహాయ నిధికి రూ.లక్ష జరిమానాగా చెల్లించాలని ఆదేశించారు. సినిమాల్లో అవినీతి వ్యతిరేక పాత్రల్లో నటిస్తున్న హీరోలు పన్నులు కట్టడంలో విఫలమవుతున్నారని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. తమిళ సినీ హీరోలు పాలకులుగా ఉన్నారని గుర్తు చేశారు. అందువల్ల ప్రజలు వారిని రియల్‌ హీరోలుగా చూస్తారన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని