సోషల్‌లుక్: తారలు పంచుకున్న విశేషాలు
* సమంత మాల్దీవుల్లో ప్రకృతి అందాల్ని ఆస్వాదిస్తున్నారు. భర్త నాగ చైతన్యతో కలిసి ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. పొట్టి దుస్తుల్లో ఆమె షేర్ చేసిన ఓ ఫొటో వైరల్ అవుతోంది. సమంత హ్యాష్‌ట్యాగ్ ట్విటర్ ట్రెండింగ్‌లో ఉంది.
* కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఇంటికెళ్లి సర్‌ప్రైజ్ ఇచ్చారు తమన్నా. ఇష్టమైన వారితో గడిపే సమయం ఇదంటూ కుక్కపిల్లతో తీసుకున్న ఫొటో షేర్ చేశారు.
* స్నేహితులు విశాల్, ఆర్య శత్రువులుగా మారారు. వీరిద్దరు కలిసి ‘ఎనిమీ’ అనే సినిమా కోసం పనిచేయబోతున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను బుధవారం ప్రకటించారు.
* తనలోని కళాకారిణిని బయటికి తీశారు అనుపమ పరమేశ్వరన్. పెయింటింగ్ వేస్తున్న ఫొటోను షేర్ చేశారు. రంగులతో ఆడుకుంటున్నానంటూ వీడియో పంచుకున్నారు.
* వర్షాలు పడుతుంటే మొదటిసారి భయమేస్తోందని మీనా అన్నారు. తన ఇంటి ఆవరణలో వర్షం పడుతున్న వీడియో షేర్ చేశారు. చెన్నైలోని చెంబరంబాక్కం డ్యామ్ గేట్లు ఎత్తారని, 2015నాటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉంటే చాలని అన్నారు.
* నివర్ తుపాను నుంచి తమిళనాడు ప్రజలు సురక్షితంగా ఉండాలని రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ప్రార్థిస్తున్నారు. ‘సైక్లోన్ రిథమ్’ అంటూ తబలా వాయిస్తున్న వీడియో షేర్ చేశారు.
* నివర్ తుపాను వేళ పేదలకు ప్రకాశ్‌రాజ్‌ఫౌండేషన్ అండగా నిలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను నటుడు ప్రకాశ్‌రాజ్ స్వయంగా ట్విటర్‌లో పోస్టు చేశారు.