ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై బాలయ్య కామెంట్‌ - balakrishna about jr ntr political entry
close
Published : 10/06/2021 21:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై బాలయ్య కామెంట్‌

హైదరాబాద్‌: రాజకీయాలు, సినిమా.. తెలుగు నాట ఎప్పుడూ ఉండే హాట్‌టాపిక్‌లు. జూనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై ఇప్పటికే అనేక మంది పలు రకాలుగా స్పందించారు. గతంలో ఎన్టీఆర్‌ తెలుగుదేశం తరఫున ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొన్నారు. తాజాగా బాలయ్య తన పుట్టినరోజు సందర్భంగా ఓ టెలివిజన్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వస్తారా? అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘‘ఎవరి ఆలోచనలు వారివి. ఎవరి ఇష్టాయిష్టాలు వాళ్లవి. ఎన్టీఆర్‌ రాజకీయాల్లో వస్తారా? లేదా? అనే దాని గురించి నేను పెద్దగా ఆలోచించడం లేదు’ అని సమాధానం ఇచ్చారు. ఎన్టీఆర్‌ రాజకీయాల్లో వస్తే పార్టీకి ప్లస్‌ అవుతుందని అనుకుంటున్నారా? అని అడగ్గా.. బాలయ్య ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నవ్వి ఊరుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఒకవేళ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్లస్‌ అయి మైనస్‌ అయితే’ అంటూ ఎదురు ప్రశ్నించారు. ‘తెలుగుదేశం పార్టీ ఒక ఆవేశంలోంచి పుట్టింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఎప్పుడూ పారదర్శకంగా ఉంటారు. అలాంటి వారికే ఈ పార్టీలో సముచిత స్థానం ఉంటుంది’’ అని బాలకృష్ణ అన్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని